7-253-క.
ఉడుగఁడు
మధురిపుకథనము
విడివడి
జడుపగిదిఁ దిరుగు వికసనమున
నే
నొడివిన
నొడువులు నొడువఁడు
దుడుకనిఁ
జదివింప మాకు దుర్లభ
మధిపా!
టీకా:
ఉడుగడు = మానడు; మధురిపు = హరి {మధురిపుడు
- మధువనెడి రాక్షసునికి రిపుడు (శత్రువు), విష్ణువు};
కథనము = కీర్తనమును; విడివడి = కట్టుబాటునుండు
తొలగి; జడున్ = మందుని; పగిదిన్ = వలె;
తిరుగు = తిరుగుచుండును; వికసమున = ఆనందముతో;
నేన్ = నేను; నొడవిన = చెప్పిన; నొడువులు = చదువులు; నొడువడు = చదవడు; దుడుకనిన్ = దుష్టుని; చదివింపన్ = చదివించుట;
మా = మా; కున్ = కు; దుర్లభము
= శక్యముకానిది; అధిపా = రాజా.
భావము:
ఓ మహారాజా! నీ కొడుకు ప్రహ్లాదుడు
ఎవరు ఎన్ని చెప్పినా మధు దానవుని పాలిటి శత్రువు అయిన ఆ విష్ణువు గురించి చెప్పటం
మానడు. ఎప్పుడూ మందమతిలా తిరుగుతూ ఉంటాడు. మనోవికాసం కోసం నేను చెప్పే మంచి మాటలు
వినిపించుకోడు. చెప్పిన మాట విననే వినడు. ఇలాంటి దుడుకు వాడిని చదివించటం మా వల్ల
కాదు.
సర్వలఘు కందపద్యం ప్రయోగించటలోని భావస్పోరకం అద్భుతం. ఈ పద్యం అమృతగుళి ఆస్వాదించండి.
సర్వలఘు కందపద్యం ప్రయోగించటలోని భావస్పోరకం అద్భుతం. ఈ పద్యం అమృతగుళి ఆస్వాదించండి.
७-२५३-क.
उडुगँडु मधुरिपुकथनमु
विडिवडि जडुपगिदिँ दिरुगु विकसनमुन ने
नोडिविन नोडुवुलु नोडुवँडु
दुडुकनिँ जदिविंप माकु दुर्लभ मधिपा!
http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=8&Padyam=253.0
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment