Wednesday, February 24, 2016

ప్రహ్లాదుని జన్మంబు - హరిసర్వాకృతులంగలం

7-276-వ.
అని యి వ్విధంబున.
7-277-మ.
"రి సర్వాకృతులం గలం" డనుచుఁ బ్రహ్లాదుండు భాషింప స
త్వరుఁడై "యెందును లేఁడు లేఁ" డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
సింహాకృతి నుండె నచ్యుతుఁడు నానా జంగమస్థావరో
త్క గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్.
టీకా:
            అని = అని; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
          హరి = నారాయణుడు; సర్వ = ఎల్ల; ఆకృతులన్ = రూపములందును; కలండు = ఉన్నాడు; అనుచున్ = అనుచు; ప్రహ్లాదుడు = ప్రహ్లాదుడు; భాషింపన్ = పలుకగా; సత్వరుడు = తొందరగలవాడు; ఐ = అయ్యి; ఎందును = ఎక్కడను; లేడు = లేడు; లేడు = లేడు; అని = అని; సుతున్ = పుత్రుని; దైత్యుండు = రాక్షసుడు; తర్జింపన్ = బెదిరించగా; శ్రీ = శోభనయుక్తమైన; నరసింహ = నరసింహ; ఆకృతిన్ = రూపముతో; ఉండెన్ = ఉండెను; అచ్యుతుడు = నారాయణుడు; నానా = పలురకముల; జంగమస్థావర = చరాచర; ఉత్కర = సమూహముల; గర్భంబులన్ = అంతర్భాగములలో; అన్ని = సమస్తమైన; దేశములన్ = చోటులందును; ఉద్దండ = గొప్ప; ప్రభావంబునన్ = మహిమతో.
భావము:
            అలా ఈ విధంగా; ప్రహ్లాదుడు "భగవంతుడు సర్వ నామ రూపధారు లందు అంతట ఉన్నాడు." అని చెప్తుంటే, హిరణ్యకశిపుడు "ఎక్కడా లేడు" అంటూ బెదిరిస్తున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి మహా మహిమాన్వితమైన నరసింహ రూపంతో సర్వ చరాచరము లన్నిటి యందు ఆవేశించి ఉన్నాడు.
            భక్తాగ్రేసర కృషీవలుడు అందించిన మధుర మైన పంటలలో ముఖ్యమైనది ప్రహ్లాద చరిత్ర. భక్తుల సామర్థ్యాల ఎలా ఉంటాయో, భక్తుల ప్రపత్తికి అతను ఎంత బలంగా స్పందిస్తాడో, అతని సర్వ వ్యాపకతా శీలం, అచ్యుత శీలం ఎలాంటివో నిరూపించే ప్రహ్లాద చరిత్రలో కథ చాలా బల మైంది, కవిత్వం మిక్కిలి ఉన్నత మైంది, సాహిత్యం ఉత్కృష్ట మైంది, విలువలు అపార మైనవి. కథానాయకుడు కొడుకు ప్రహ్లాదుడు {ప్రహ్లాదుడు – ప్ర (విశిష్ట మైన) హ్లాదుడు (ఆనందము కల వాడు), విష్ణుభక్తుడు} పరమ భక్తుడు సాత్వికుడు ఓర్పు శ్రద్ధలకు మారు పేరు. ప్రతినాయకుడు తండ్రి హిరణ్యకశిపుడు {హిరణ్యకశిపుడు – హిరణ్యము (బంగారము, అగ్నిదేవుని సప్త జిహ్వలలో ఒకటి) కశిపుడు (పరపు, విరివి కల వాడు), దానవుడు} పరమ బలాడ్యు డైన రాక్షసుడు తమోగుణ పరాకాష్ట. మరి కథలో బలానికి లోటే ముంటుంది. చదివించిరి, దిక్కులు గెలిచితి, కల డంభోధి, ఇందు గల డందు లాంటి పద్యాలలోని కవిత్వ సాహిత్య సౌరభాలే కదా వాటిని పండిత జనసామాన్య నాలుకలపై నానేలా చేసినవి. ఎన్ని కష్టా లెదురైనా చెక్కు చెదరని భక్తుల ప్రపత్తి నిబద్ధతతో కూడిన భక్తుల విలువలు. నారసింహ తత్వపు భక్తుని ఎడ భగవంతుడు చూపే అత్యద్భుత మైన వాత్యల్య విలువలు తిరుగు లేనివి. ఎంతటి భయంకర మైన పరిస్థితులలో ఉన్నా ఈ పద్యం మననం చేస్తు ఉంటే ఎట్టి పరిస్థితులలో మేలే తప్ప కీడు జరగదు అన్నది జగద్వితమే.
            ఓం నరసింహ వషట్కారాయః నమః
७-२७६-व.
अनि यि व्विधंबुन.
७-२७७-म.
"हरि सर्वाकृतुलं गलं" डनुचुँ ब्रह्लादुंडु भाषिंप स
त्वरुँडै "येंदुनु लेँडु लेँ" डनि सुतुन् दैत्युंडु तर्जिंप श्री
नरसिंहाकृति नुंडे नच्युतुँडु नाना जंगमस्थावरो
त्कर गर्भंबुल नन्नि देशमुल नुद्दंड प्रभावंबुनन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: