7-281-వ.
అనిన భక్తవత్సలుని భటుం డి ట్లనియె.
7-282-శా.
"అంభోజాసనుఁ
డాదిగాఁగ దృణపర్యంతంబు విశ్వాత్ముఁడై
సంభావంబున
నుండు ప్రోడ విపులస్తంభంబునం
దుండడే?
స్తంభాంతర్గతుఁ
డయ్యు నుండుటకు నే సందేహమున్
లేదు ని
ర్దంభత్వంబున
నేఁడు గానఁబడు బ్రత్యక్షస్వరూపంబునన్."
7-283-వ.
అనిన విని కరాళించి గ్రద్దన లేచి గద్దియ డిగ్గనుఱికి
యొఱఁబెట్టిన ఖడ్గంబు పెఱికి కేల నమర్చి జళిపించుచు మహాభాగవతశిఖామణి యైన
ప్రహ్లాదుని ధిక్కరించుచు.
టీకా:
అనినన్ =
అనగా; భక్తవత్సలుని = విష్ణుని {భక్తవత్సలుడు - భక్తులయెడ
వాత్యల్యము గలవాడు, విష్ణువు}; భటుండు
= దాసుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె =
పలికెను.
అంభోజసనుడు = బ్రహ్మదేవుడు {అంభోజసనుడు - అంభోజ
(పద్మము) ఆసనుడు (ఆసనముగగలవాడు), విష్ణువు}; ఆదిగా = మొదలుపెట్టి; తృణ = గడ్డిపరక; పర్యంతంబున్ = వరకు; విశ్వాత్ముడు = విశ్వమందంతటనుగలవాడు;
ఐ = అయ్యి; సంభావంబునన్ = ఆదరముతో; ఉండు = ఉండెడి; ప్రోడ = నేరుపుకాడు; విపుల = పెద్ద; స్తంభంబున్ = స్తంభము; అందున్ = లో; ఉండడే = ఉండడా ఏమి, తప్పకఉండును; స్తంభ = స్తంభము; అంతర్గతుండు = లోనుండువాడు; అయ్యున్ = అయ్యి;
ఉండుట = ఉండుట; కున్ = కు; ఏ = ఏమాత్రము; సందేహము = అనుమానము; లేదు = లేదు; నిర్దంభత్వంబునన్ = నిష్కపటముగ;
నేడున్ = ఇప్పుడు; కానబడున్ = కనబడును;
ప్రత్యక్ష = కన్నులకగుపడు; స్వరూపంబునన్ =
నిజరూపముతో.
అనినన్ = అనగా; విని = విని; కరాళించి
= బొబ్బరిల్లి; గ్రద్దనన్ = చటుక్కున; లేచి
= లేచి; గద్దియన్ = సింహాసనమును; డిగ్గనుఱికి
= దిగదుమికి; ఒఱన్ = ఒరలో; పెట్టిన =
పెట్టిన; ఖడ్గంబున్ = కత్తిని; పెఱికి
= బయటకుతీసి, దూసి; కేలన్ = చేతిలో;
అమర్చి = పట్టుకొని; జళిపించుచు = ఆడించుచు;
మహా = గొప్ప; భాగవత = భాగవతులలో; శిఖామణి = ఉత్తముడు; ఐన = అయిన; ప్రహ్లాదుని = ప్రహ్లాదుని; ధిక్కరించుచు =
తిరస్కరించుచు.
భావము:
అలా తండ్రి పెద్దగా గద్దించాడు. భక్తవత్సలుని పరమ భక్తుడైన ఆ ప్రహ్లాదుడు ఇలా పలికాడు.
అలా అనే సరికి హిరణ్యాక్షుడు ఒక్కసారిగా వికటాట్టహాసం చేశాడు. చివాలున
లేచి సింహాసనం మీంచి క్రిందికి ఉరికి వచ్చాడు. ఒరలో ఉన్న ఖడ్గాన్ని లాగి ఝళిపించి
భక్తాగ్రేసరుడైన ప్రహ్లాడుడిని భయపెడుతూ ధిక్కరించి ఇలా గర్జించాడు.
७-२८१-व.
अनिन भक्तवत्सलुनि भटुं
डि ट्लनिये.
७-२८२-शा.
"अंभोजासनुँ डादिगाँग दृणपर्यंतंबु विश्वात्मुँडै
संभावंबुन नुंडु प्रोड
विपुलस्तंभंबुनं दुंडडे?
स्तंभांतर्गतुँ डय्यु
नुंडुटकु ने संदेहमुन् लेदु नि
र्दंभत्वंबुन नेँडु
गानँबडु ब्रत्यक्षस्वरूपंबुनन्."
७-२८३-व.
अनिन विनि कराळिंचि ग्रद्दन
लेचि गद्दिय डिग्गनुर्रिकि योर्रँबेट्टिन खड्गंबु पेर्रिकि केल नमर्चि जळिपिंचुचु
महाभागवतशिखामणि यैन प्रह्लादुनि धिक्करिंचुचु.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment