Wednesday, February 3, 2016

ప్రహ్లాదుని జన్మంబు - ఉల్లసిత విష్ణుకథనము

7-252-క.
ల్లసిత విష్ణుకథనము
లెల్లప్పుడు మాఁకు జెప్పఁ డీ గురుఁ డని న
న్నుల్లంఘించి కుమారకు
లొల్లరు చదువంగ దానవోత్తమ! వింటే.
టీకా:
ఉల్లసిత = ఉల్లాసవంతమైన; విష్ణు = విష్ణుని; కథనములు = గాథలు; ఎల్లప్పుడున్ = ఎప్పుడును; మా = మా; కున్ = కు; చెప్పడు = చెప్పడు; ఈ = ఈ; గురుడు = గురువు; అని = అని; నన్నున్ = నన్ను; ఉల్లంఘించి = అతిక్రమించి; కుమారకులు = పిల్లలు; ఒల్లరు = ఇష్టపడరు; చదువంగన్ = చదువుటకు; దానవోత్తమ = రాక్షసులలో ఉత్తముడా; వింటే = విన్నావా.
భావము:
            ఓ దానవశ్రేష్ఠుడా! వింటున్నావు కదా! శిష్యులు “ఈ గురువు మనకు మాధవుని కథలు మనోహరంగా చెప్పడు” అని అనుకుంటూ, నన్నూ నా మాటలు లెక్కచేయటం మానేశారు. నేను చెప్పే చదువులు చదవటం మానేశారు. ఇదీ పరిస్థితి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: