Sunday, November 9, 2014

రుక్మిణీకల్యాణం – పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు

11- వ.
మఱియును నానాదినప్రవర్ధమాన యై.
12- సీ.
పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు
    బలలతోడ వియ్యంబు లందు;
గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి
    చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;
మణీయ మందిరారామ దేశంబులఁ
    బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు;
దమల మణిమయ సౌధభాగంబుల
    లీలతో భర్మడోలికల నూఁగు
తే.
బాలికలతోడఁ జెలరేగి బంతు లాడు
శారికా కీర పంక్తికిఁ దువుఁ జెప్పు
ర్హి సంఘములకు మురిములు గరపు
దమరాళంబులకుఁ జూపు మందగతులు.
    అలా రుక్మిణి దినదినప్రవర్థమానంగా ఎదుగుతోంది. బొమ్మల పెళ్ళిళ్ళు చక్కగా చేసి చెలికత్తెలతో వియ్యాలందే ఆట్లాడుతోంది. గుజ్జన గూళ్లు వండించి పెడుతోంది. అందమైన తోటల్లో పూతీగెలకి గొప్పులు కడుతోంది. సౌధాలలో బంగారపుటుయ్యాలలు ఊగుతోంది. చెలులతో బంతులాట లాడుతోంది. చిలక పలుకులు, నెమలి మురిపాలు, మదగజాల మందగతులతో అతిశయిస్తోంది.
­12- see.
pErvEra bommala peMDliMDlu chEyuchu
      nabalalatODa viyyaMbu laMdu;
gujjenaM~ gooLulu gomaroppa vaMDiMchi
      chelulakuM~ beTTiMchuM~ jeluvu meRrasi;
ramaNeeya maMdiraaraama dEshaMbulaM~
      buvvuM~ deegelakunu brOdi chEyu;
sadamala maNimaya saudhabhaagaMbula
      leelatO bharmaDOlikala nooM~gu
tE.
baalikalatODaM~ jelarEgi baMtu laaDu
shaarikaa keera paMktikiM~ jaduvuM~ jeppu
barh~i saMghamulaku muripamulu garapu
madamaraaLaMbulakuM~ joopu maMdagatulu.
          మఱియునున్ = ఇంకను; నానాదిన = నానాటికి; ప్రవర్ధమాన = పెరుగుచున్నది; = అయ్యి.
          పేర్వేరన్ = పేరుపేరున; బొమ్మల = ఆయా బొమ్మలకు; పెండ్లిండ్లు = పెళ్ళిళ్ళు; చేయుచున్ = చేస్తూ; అబలల = బాలికల; తోడన్ = తోటి; వియ్యంబులు = సంబంధములు; అందున్ = చేయును; గుజ్జనగూళులున్ = గుజ్జెనగూళ్ళు {గుజ్జెనగూళ్ళు - పిల్లలు ఆటలందు చిన్నచిన్న గిన్నెలలో తయారుచేసుకొను ఆహారపదార్థములు}; కొమరొప్ప = చక్కగా; వండించి = తయారుచేయించి; చెలుల్ = స్నేహితుల; కున్ = కు; పెట్టించున్ = పెట్టించును; చెలువు = చక్కదనములు; మెఱసి = పెంపొందగా; రమణీయ = అందమైన; మందిర = గృహము లందలి; ఆరామ = ఉద్యానవనము లోని; దేశంబులన్ = ప్రదేశము లందు; పువ్వుతీగెల్ = పూలతీవల; కున్ = కు; ప్రోది = పోషించుట; చేయున్ = చేయును; సదమల = మిక్కలి నిర్మలమైన; మణి = రత్నాలు; మయ = పొదిగిన; సౌధ = మేడలపై (డాబాల); భాగంబులన్ = భాగముల; లీల = విలాసముల; తోన్ = తోటి; భర్మ = బంగారు; డోలికలన్ = ఊయల లందు; ఊగున్ = ఊగును.
          బాలికల = ఆడపిల్లల; తోడన్ = తోటి; చెలరేగి = విజృంభించి; బంతులు = బంతులాటలు; ఆడున్ = ఆడును; శారికా = గోరువంకల; కీర = చిలుకల; పంక్తి = సమూహముల; కిన్ = కు; చదువున్ = పలుకులు పలుకుట; చెప్పున్ = చెప్పును; బర్హి = నెమళ్ళ; సంఘముల్ = సమూహముల; కున్ = కు; మురిపెములున్ = నడకల వయ్యారములు; కరపున్ = నేర్పును; మద = మదించిన; మరాళంబుల్ = హంసల; కున్ = కు; చూపున్ = నేర్పును; మంద = మెల్లని; గతులు = నడకలు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: