10- క.
బాలేందురేఖ
దోఁచిన
లాలిత
యగు నపరదిక్కులాగున ధరణీ
పాలుని
గేహము మెఱసెను
బాలిక
జన్మించి యెదుగ భాసుర
మగుచున్.
ఈమె పుట్టిననాటి నుండి ఆ రాజగృహం, చంద్ర
రేఖ ఉదయించిన పడమటి ఆకాశంలా, ప్రకాశవంతంగా మెరిసిపోతోంది.
{ఆమె కుటుంబంలో
జన్మించిది అనినను, అందరికి పరమైనది కనుక, ఇతరమైనవి అన్నీ అపరములే కనుక. పరాదేవి అపరమైన
మనంతటిని ప్రకాశంపజేస్తుంది కనుక అపర దిక్కు ప్రయోగించారా?}
10- ka.
baalEMdurEkha dOM~china
laalita yagu
naparadikkulaaguna dharaNee
paaluni gEhamu meRrasenu
baalika janmiMchi yeduga
bhaasura maguchun.
బాలేందురేఖ = నెలవంక {బాలేందురేఖ - నెల మొదటిరోజు (అమావాశ్య వెళ్ళిన పాడ్యమునాటి)
చంద్రబింబము యొక్క వంక, నెలవంక}; తోచినన్ = ఉదయించగా; లాలిత = మనోజ్ఞముగా; అగున్ = అయ్యెడి; అపరదిక్కు = పడమర; లాగునన్ = వలె; ధరణీపాలుని = రాజు యొక్క; గేహము = గృహము, నివాసము {గృహము (ప్ర) - గేహము (వి)}; మెఱసెను = ప్రకాశించెను; బాలిక = ఆడపిల్ల; జన్మించి = పుట్టి; యెదుగన్ = పెరుగుచుండగా; భాసురము = మిక్కిలి
ప్రకాశముకలది; అగుచున్ = అగుచు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment