Monday, November 10, 2014

రుక్మిణీకల్యాణం – దేవకీసుతు కోర్కి

13- వ.
అంత.  
14- సీ.
దేవకీసుతు కోర్కి తీఁగలు వీడంగ
          వెలఁదికి మైదీఁగ వీడఁ దొడఁగెఁ;
మలనాభుని చిత్త మలంబు వికసింపఁ
          గాంతి నింతికి ముఖమల మొప్పె;
ధువిరోధికి లోన దనాగ్ని పొడచూపఁ
          బొలఁతికి జనుదోయి పొడవు జూపె;
శౌరికి ధైర్యంబు న్నమై డయ్యంగ
          లజాక్షి మధ్యంబు న్నమయ్యె;
ఆ.
రికిఁ బ్రేమబంధ ధింకంబుగాఁ గేశ
బంధ మధిక మగుచు బాల కమరెఁ;
ద్మనయను వలనఁ బ్రమదంబు నిండార
నెలఁత యౌవనంబు నిండి యుండె.
    అప్పుడు. కృష్ణుడి కోరికలు విప్పారేలా, రుక్మిణి మేని మెరుపులు విరిసాయి. మనస్సు వికసించేలా, ముఖపద్మం వికసించింది. మదనతాపం కలిగేలా, స్తనసంపద ఉదయించింది. ధైర్యం సన్నగిల్లేలా, నడుం సన్నబడింది. ప్రేమ పెరిగి పొంగేలా, శిరోజాలు చక్కగా వృద్ధిచెందేయి. కృష్ణుడికి సంతోషం కలిగించేలా, రుక్మిణికి నిండు యౌవనం తొణకిస లాడుతోంది.
13- va.
aMta. 
14- see.
dEvakeesutu kOrki teeM~galu veeDaMga
          velaM~diki maideeM~ga veeDaM~ doDaM~geM~;
gamalanaabhuni chitta kamalaMbu vikasiMpaM~
          gaaMti niMtiki mukhakamala moppe;
madhuvirOdhiki lOna madanaagni poDachoopaM~
          bolaM~tiki janudOyi poDavu joope;
shauriki dhairyaMbu sannamai DayyaMga
          jalajaakShi madhyaMbu sannamayye;
aa.
harikiM~ brEmabaMdha madhiMkaMbugaaM~ gEsha
baMdha madhika maguchu baala kamareM~;
badmanayanu valanaM~ bramadaMbu niMDaara
nelaM~ta yauvanaMbu niMDi yuMDe.
అంతన్ = అంతట.
 దేవకీసుతు = కృష్ణుని యొక్క {దేవకీసుతుడు - దేవకీదేవి పుత్రుడు, కృష్ణుడు}; కోర్కి = కోరికలు అనెడి; తీగెలు = తీవెలు; వీడంగన్ = కొనసాగగా, వర్ధిల్లగా; వెలది = స్త్రీ; కిన్ = కి; మై = దేహము అనెడి; తీగ = తీవె; వీడన్ = వర్థిల్ల, వికసింప; తొడగెన్ = మొదలెట్టెను; కమలనాభుని = కృష్ణుని యొక్క {కమలనాభుడు - కమలము (బ్రహ్మ పుట్టిన) బొడ్డున కలవాడు, విష్ణువు}; చిత్త = మనసు అనెడి; కమలంబు = పద్మము; వికసింపన్ = వికసించునట్లు; కాంతిన్ = ప్రకాశముతో; ఇంతి = సుందరి; కిన్ = కి; ముఖ = ముఖము అనెడి; కమలము = పద్మము; ఒప్పెన్ = చక్కనయ్యెను; మధువిరోధి = కృష్ణుని {మధువిరోధి - మధుఅనెడి రాక్షసుని శత్రువు, విష్ణువు}; కిన్ = కి; లోనన్ = మనసులో; మదనా = మన్మథ; అగ్ని = తాపము; పొడచూపన్ = కనబడగా; పొలతి = సుందరి; కిన్ = కి; చను = స్తనముల; దోయిన్ = ద్వయము; పొడవు = వృద్ధిచెందుట; చూపెన్ = కనబడెను; శౌరి = కృష్ణుని {శౌరి - శూరుని మనుమడు, కృష్ణుడు}; కిన్ = కి; ధైర్యంబు = తాలిమి; సన్నము = తక్కువ; = అయ్యి; డయ్యంగన్ = పొందగా; జలజాక్షి = సుందరి యొక్క {జలజాక్షి - పద్మముల వంటి కన్నులామె, స్త్రీ}; మధ్యంబు = నడుము; సన్నమున్ = సన్నముగా; అయ్యెన్ = అయినది.
 హరి = కృష్ణుని; కిన్ = కి; ప్రేమ = ప్రేమమీద; బంధము = ఆసక్తి; అధికంబు = పెరుగుతున్నది; కాన్ = అగుచుండగా; కేశ = తలవెంట్రుకల; బంధము = సమూహము; అధికము = సమృద్ధి; అగుచున్ = పొందుతు; బాల = బాలిక; కున్ = కు; అమరెన్ = ఒప్పినది; పద్మనయను = కృష్ణుని {పద్మనయనుడు - పద్మాక్షుడు, కృష్ణుడు}; వలన = వైపు; ప్రమదంబు = సంతోషములు; నిండారన్ = సమృద్ధి యగుచుండగ; నెలత = సుందరి; యౌవనంబున్ = ప్రాయము; నిండి = పరిపూర్ణమై; ఉండె = ఉన్నది.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: