Thursday, November 13, 2014

రుక్మిణీకల్యాణం – బంధువు లెల్లఁ

18- వ.
అంత.       
19- ఉ.
బంధువు లెల్లఁ గృష్ణునకు బాలిక నిచ్చెద మంచు శేముషీ
సింధువులై విచారములు చేయఁగ వారల నడ్డపెట్టి దు
స్సంధుఁడు రుక్మి కృష్ణునెడఁ జాల విరోధముఁ జేసి మత్త పు
ష్పంయవేణి నిత్తు శిశుపాలున కంచుఁ దలంచె నంధుఁడై.
          అప్పుడు.
       రుక్మిణిని బంధువు లంతా సముద్ర మంత సద్భుద్దితో కృష్ణుడి కిద్దాం అనుకుంటున్నారు. కాని వారిని కాదని దుష్టుడు రుక్మి అంధుడై కృష్ణుడి యందు యెంతో విరోధం పెట్టుకొని శిశుపాలుడికి సుందరవేణిని రుక్మిణిని ఇస్తానంటున్నాడు.
18- va.
aMta. 
19- u.
baMdhuvu lellaM~ gRiShNunaku baalika nichcheda maMchu shEmuShee
siMdhuvulai vichaaramulu chEyaM~ga vaarala naDDapeTTi du
ssaMdhuM~Du rukmi kRiShNuneDaM~ jaala virOdhamuM~ jEsi matta pu
ShpaMdhayavENi nittu shishupaaluna kaMchuM~ dalaMche naMdhuM~Dai.
          అంత = అంతట.
       బంధువులు = చుట్టములు; ఎల్లన్ = అందరు; కృష్ణున్ = కృష్ణుని; కున్ = కి; బాలికను = కన్యకను, రుక్మిణిని; ఇచ్చెదము = పెండ్లిచేయుదము; అంచున్ = అని; శేముషీ = సద్బుద్ధి; సింధువులు = సముద్రమంత కలవారు; = అయ్యి; విచారములు = ఆలోచనలు; చేయగన్ = చేయుచుండగా; వారలన్ = వారిని; అడ్డపెట్టి = అడ్డుకొని; దుస్సంధుడు = చెడ్డప్రతిజ్ఞ కలవాడు; రుక్మి = రుక్మి; కృష్ణున్ = కృష్ణుని; ఎడన్ = అందు; చాల = అధికముగా; విరోధమున్ = శత్రుత్వము; చేసి = పెట్టుకొని; మత్త = మదించిన; పుష్పంధయ = తుమ్మెదలవంటి {పుష్పంధయము - పూలలోని మధువునుగ్రోలునది, తుమ్మెది}; వేణిన్ = జడకలామెను, రుక్మిణిన్; ఇత్తున్ = వివాహమున ఇచ్చెదను; శిశుపాలున్ = శిశుపాలుని; కిన్ = కి; అంచున్ = అని; తలచెన్ = ఎంచెను; అంధుడు = కన్నుగానని వాని వలె; = అయ్యి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: