23- సీ.
జగతీసురేశ్వర!
సంతోషచిత్తుండ
వై
యున్న నీ ధర్మ మతిసులభము
వృద్ధసమ్మత
మిది విత్త మెయ్యది యైనఁ
బ్రాపింప
హర్షించు బ్రాహ్మణుండు
దన
ధర్మమున నుండుఁ దరలఁ
డా ధర్మంబు
గోరిక
లతనికిఁ గురియుచుండు
సంతోషిగాఁడేని
శక్రుఁడైన నశించు
నిర్ధనుండైనను నిద్రబోవు
ఆ.
సంతసించెనేని, సర్వభూతసుహృత్త
ములకుఁ
బ్రాప్తలాభ ముదితమాన
సులకు శాంతులకును
సుజనులకును గర్వ
హీనులకును
వినతు లే నొనర్తు.
“ఓ బ్రాహ్మణుడా!
లోకులందరిచే గౌరవింపబడువాడ! నీ పద్దతి చక్కటిది,
తీరైనది, పెద్దలు అంగీకరించేది. బ్రాహ్మణుడు దొరికిన ధనంతోనే తృప్తి పడతాడు. తన
దర్మాన్ని వదలిపెట్టడు. ఆ ధర్మమే అతనికి కావలసినవన్నీ సమకూరుస్తుంది. విప్రుడు
తృప్తి చెందకపోతే ఇంద్రుడైనా నాశనమైపోతాడు. తృప్తి చెందాడా, దరిద్రుడు కూడ యెంతో
సుఖంగా ఉంటాడు. నేను సకల జీవులకు ఆప్తులు, దొరికిన దానితోనే తృప్తిచెందే వారు, శాంతస్వభావులు, మంచివారు, గర్వ హీనులు ఐన విప్రులకి నమస్కరిస్తాను.
23- see.
jagateesurEshvara! saMtOShachittuMDa
vai yunna nee dharma matisulabhamu
vRiddhasammata midi vitta meyyadi yainaM~
braapiMpa harShiMchu braahmaNuMDu
dana dharmamuna nuMDuM~ daralaM~ Daa dharmaMbu
gOrika latanikiM~ guriyuchuMDu
saMtOShigaaM~DEni shakruM~Daina nashiMchu
nirdhanuMDainanu nidrabOvu
aa.
saMtasiMchenEni, sarvabhootasuhRitta
mulakuM~ braaptalaabha muditamaana
sulaku shaaMtulakunu sujanulakunu garva
heenulakunu vinatu lE nonartu.
జగతీసుర = విప్రులలో {జగతీసురుడు - భూలోకమునకు దేవుడు, బ్రాహ్మణుడు}; ఈశ్వరా = శ్రేష్ఠుడా; సంతోష = సంతోషముతోకూడిన; చిత్తుండవు = మనసుకలవాడవు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; నీ = నీ యొక్క; ధర్మము = స్వభావము; అతి = మిక్కిలి; సులభము = ఆమోదయోగ్యమైనది; వృద్ధ = పెద్దలచే; సమ్మతము = అంగీకరింపబడినది; ఇది = ఇది; విత్తము = ధనము; ఎయ్యది = ఏది; ఐనన్ = అయినప్పటికి; ప్రాప్తింపన్ = లభించినచో; హర్షించున్ = సంతోషించును; బ్రాహ్మణుండున్ = విప్రుడు; తన = అతని యొక్క, స్వ; ధర్మమునన్ = ధర్మమునందే; ఉండున్ = నిలుకడగా ఉండును; తరలడు = తప్పుకొనడు; ధర్మంబున్ = స్వధర్మమును; కోరికలు = కోరినవి; అతని = అతని; కిన్ = కి; కురియుచున్ = సమృద్ధిగాదొరకుచు; ఉండున్ = ఉండును; సంతోషి = సంతోషించినవాడు; కాడేని = కానిపక్షమున; శక్రుడు = ఇంద్రుడు; ఐనన్ = అయినను; నశించున్ = నశించిపోవును; నిర్దనుండు = మిక్కలి బీదవాడు; ఐననున్ = అయినను; నిద్రపోవున్ = సుఖముగా నిద్రించును.
సంతసించెనేని = సంతోషించినచో; సర్వ = సమస్తమైన; భూత = ప్రాణులకు; సుహృత్తముల్ = మేలుకోరువారల; కున్ = కు; ప్రాప్త = పొందబడిన; లాభ = లాభములచేతనే; ముదిత = సంతోషించునట్టి; మానసుల్ = మనసులు కలవారిల; కున్ = కు; శాంతుల్ = శాంతస్వభావము కలవారి; కును = కి; సుజనుల్ = మంచివారి; కును = కి; గర్వ = గర్వము; హీనుల్ = లేనివారి; కును = కి; వినతులు = నమస్కారములు; ఏన్ = నేను; ఒనర్తు = చేయుదును.
:
: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment