22- వ.
అని
కొన్ని రహస్యవచనంబులు చెప్పిన విని, బ్రాహ్మణుండు ద్వారకానగరంబునకుం జని, ప్రతిహారుల వలనఁ దన రాక యెఱింగించి యన్నగధరుం డున్న నగరు ప్రవేశించి,
యందుఁ గనకాసనాసీనుం డయి యున్న పురుషోత్తముం గాంచి “పెండ్లికొడుకవుగ” మ్మని దీవించిన ముసిముసి నగవులు
నగుచు బ్రహ్మణ్యదేవుం డైన హరి తన గద్దియ దిగ్గన డిగ్గి, బ్రాహ్మణుం
గూర్చుండ నియోగించి, తనకు దేవతలు చేయు చందంబునం బూజలు చేసి,
సరస పదార్థ సంపన్నంబైన యన్నంబుఁ బెట్టించి, రెట్టించిన
ప్రియంబున నయంబున భాసురుండైన భూసురుం జేరి లోకరక్షణ ప్రశస్తంబైన హస్తంబున నతని
యడుగులు పుడుకుచు మెల్లన నతని కిట్లనియె.
ఇలా చెప్పి కొన్ని రహస్య
సంకేతాలు చెప్పి పంపింది. ఆ బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళాడు. ప్రతీహారుల ద్వారా తన
రాక తెలిపాడు. అంతఃపురంలో బంగారు ఆసనం మీదున్న కృష్ణుణ్ణి దర్శించి “కల్యణ ప్రాప్తిరస్తు” అని దీవించాడు. సంతోషించిన
కృష్ణుడు గద్దె దిగి, ఆసీనుణ్ణి చేసి, భక్తిగా పూజించి, మంచి రుచికరమైన భోజనం
పెట్టించేడు. ద్విగుణీకృతమైన ప్రేమతో తేజోరాశిలా ఉన్న బ్రాహ్మణుని దరిజేరి లోకాల్ని
కాపాడే తన చేత్తో కాళ్ళొత్తుతూ, కృష్ణుడు మెల్లగా ఇలా అన్నాడు.
22- va.
ani konni
rahasyavachanaMbulu cheppina vini, braahmaNuMDu dvaarakaanagaraMbunakuM jani,
pratihaarula valanaM~ dana raaka yeRriMgiMchi yannagadharuM Dunna nagaru
pravEshiMchi, yaMduM~ ganakaasanaaseenuM Dayi yunna puruShOttamuM gaaMchi
“peMDlikoDukavuga” mmani deeviMchina musimusi nagavulu naguchu brahmaNyadEvuM
Daina hari tana gaddiya diggana Diggi, braahmaNuM goorchuMDa niyOgiMchi, tanaku
dEvatalu chEyu chaMdaMbunaM boojalu chEsi, sarasa padaartha saMpannaMbaina
yannaMbuM~ beTTiMchi, reTTiMchina priyaMbuna nayaMbuna bhaasuruMDaina bhoosuruM
jEri lOkarakShaNa prashastaMbaina hastaMbuna natani yaDugulu puDukuchu mellana
natani kiTlaniye.
అని = అని; కొన్ని = కొన్ని, సరిపడెడి; రహస్య = రహస్యమైన; వచనంబులున్ = మాటలు; చెప్పినన్ = చెప్పగా; విని = విని; బ్రాహ్మణుండున్ = బ్రాహ్మణుడు; ద్వారకానగరంబున్ = ద్వారకాపట్టణమున; కున్ = కు; చని = వెళ్ళి; ప్రతీహారుల = ద్వారపాలకుల; వలనన్ = ద్వారా; ఎఱింగించి = తెలిపి; ఆ = ఆ ప్రసిద్ధుడైన; నగధరుండు = కృష్ణుడు {నగధరుడు - నగ (గోవర్ధన పర్వతమును) ధరుడు
(ధరించినవాడు), కృష్ణుడు}; ఉన్న = ఉన్నట్టి; నగరు = అంతఃపురము; ప్రవేశించి = లోనికివెళ్ళి; అందున్ = దానిలో; కనక = బంగారు; ఆసనా = ఆసనముపై; ఆసీనుండు = కూర్చున్నవాడు; అయి = ఐ; ఉన్న = ఉన్నట్టి; పురుషోత్తమున్ = కృష్ణుని; కాంచి = చూసి; పెండ్లికొడుకవు = పెండ్లికొడుకువు; కమ్ము = అగుము; అని = అని; దీవించినన్ = ఆశీర్వదించగా; ముసిముసి నగవులు = చిరునవ్వులు; నగుచున్ = నవ్వుతు; బ్రహ్మణ్య = వైదికకర్మ లందు; దేవుండు = పూజ్యుడైనవాడు; ఐన = అయినట్టి; హరి = కృష్ణుడు; తన = అతని యొక్క; గద్దియన్ = ఆసనమును, పీఠమును; దిగ్గనన్ = చటుక్కున; డిగ్గి = దిగి; బ్రాహ్మణున్ = విప్రుని; కూర్చుండన్ = కూర్చుండుము అని; నియోగించి = చెప్పి; తన = అతని; కున్ = కి; దేవతలు = దేవతలు; చేయు = చేయునట్టి; చందంబునన్ = విధముగ; పూజలున్ = మర్యాదలు చేయుట; చేసి = చేసి; సరస = రసవంతములైన; పదార్థ = వస్తువులు; సంపన్నంబు = సమృద్ధిగాకలవి; ఐన = అయిన; అన్నంబున్ = భోజనము; పెట్టించి = పెట్టించి; రెట్టించిన = దిగ్విణీకృతంబైన; ప్రియంబునన్ = ప్రేమతో; నయంబునన్ = నమ్రతతో; భాసురుండు = తేజస్సు కలవాడు; ఐన = అయిన; భూసురున్ = విప్రుని {భూసురుడు - భూమిపైని దేవుడు, బ్రాహ్మణుడు}; చేరి = దగ్గరకు వెళ్ళి; లోక = సర్వలోకములను; రక్షణ = కాపాడుటలో; ప్రశస్తంబు = శ్లాఘింపదగినది; ఐన = అగు; హస్తంబునన్ = చేతితో; అతని = అతని యొక్క; అడుగులు = పాదములను; పుడుకుచున్ = వత్తుతు; మెల్లనన్ = మెల్లిగా; అతని = అతని; కిన్ = ఉద్దేశించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
:
: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment