6- శా.
కల్యాణాత్మకమైన
విష్ణుకథ లాకర్ణించుచున్ ముక్త వై
కల్యుం డెవ్వఁడు
తృప్తుఁడౌ; నది వినంగాఁ
గ్రొత్త లౌచుండు సా
కల్యం
బేర్పడ భూసురోత్తమ! యెఱుంగం
బల్కవే; రుక్మిణీ
కల్యాణంబు
వినంగ నాకు మదిలోఁ గౌతూహలం
బయ్యెడిన్.
శుకమహర్షి! ముక్తి కోరేవాడికి శుభకరమైన విష్ణు కథలు ఎంత విన్నా తృప్తి తీరదు కదా. విన్నకొద్దీ
తెలిసుకొన్న కొద్దీ నిత్య నూతనంగా ఉంటయి కదా అవి. రుక్మిణీ కల్యాణం వినాలని
కుతూహలంగా ఉంది, వివరంగా చెప్పు.
6- shaa.
kalyaaNaatmakamaina
viShNukatha laakarNiMchuchun mukta vai
kalyuM
DevvaM~Du tRiptuM~Dau; nadi vinaMgaaM~ grotta lauchuMDu saa
kalyaM bErpaDa
bhoosurOttama! yeRruMgaM balkavE; rukmiNee
kalyaaNaMbu
vinaMga naaku madilOM~ gautoohalaM bayyeDin.
కల్యాణాత్మకము = శుభములు కలది; ఐన = అయిన; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; కథలున్ = కథలను; ఆకర్ణించుచున్ = వినుచు; ముక్త = విడువబడిన; వైకల్యుండు = వికలత్వము
కలవాడు; ఎవ్వడు = ఎవరు మాత్రము; తృప్తుడు = తృప్తిచెందినవాడు; ఔన్ = అగును; అది = అట్టిది; వినంగన్ = వినుచుండగా; క్రొత్తలు = అపూర్వమైనవిగా; ఔచుండున్ = అనిపించును; సాకల్యంబు = సమస్తము; ఏర్పడన్ = విశదమగునట్లు; భూసుర = బ్రాహ్మణ; ఉత్తమ = శ్రేష్ఠుడా; ఎఱుంగన్ = తెలియ; పల్కవే = చెప్పుము; రుక్మణీ = రుక్మిణీ దేవి
యొక్క; కల్యాణంబున్ = కల్యాణ కథనమును; వినంగన్ = వినవలెనని; నా = నా; కున్ = కు; మది = మనసు; లోన్ = అందు; కౌతూహలంబు = కుతూహలముకలుగుట; అయ్యెడిన్ = పుట్టుచున్నది.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=202&Padyam=1684
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment