Thursday, November 27, 2014

రుక్మిణీకల్యాణం – పల్లవ వైభవాస్పదములు

34- వ.
అని యిట్లు రుక్మిణీదేవి పుత్తెంచిన సందేశంబులు, రూప సౌంద ర్యాది విశేషంబులును బ్రాహ్మణుండు హరికి విన్నవించి కర్తవ్యం బెద్ది చేయ నవధరింపుమని సవరణగా నిట్లనియె.
35- సీ.
ల్లవ వైభవాస్పదములు పదములు;
          నకరంభాతిరస్కారు లూరు;
రుణప్రభామనోరములు గరములు;
          కంబుసౌందర్యమంళము గళము;
హిత భావాభావధ్యంబు మధ్యంబు;
          క్షురుత్సవదాయి న్నుదోయి;
రిహసితార్ధేందు టలంబు నిటలంబు;
          జితమత్త మధుకరశ్రేణి వేణి;
ఆ.
భావజాశుగముల ప్రాపులు చూపులు;
కుసుమశరుని వింటి కొమలు బొమలు;
చిత్తతోషణములు చెలువభాషణములు;
లజనయన ముఖము చంద్రసఖము.
          ఇలా శ్రీకృష్ణునికి బ్రాహ్మణుడు రుక్మిణీదేవి పంపిన సందేశం, ఆమె అందచందాది విశేషాలు వివరంగా చెప్పి ఏం చేయాలో చూడు అని విన్నవించి, తగ్గిన స్వరంతో సౌమ్యంగా ఇంకా ఇలా చెప్పాడు
          ఆ పద్మాక్షి రుక్మిణీదేవి పాదాలు చిగురాకుల వంటివి. తొడలు బంగారు అరటిబోదెల కన్న చక్కటివి. చేతులు ఎర్రటి కాంతులతో మనోహరమైనవి. అందమైన కంఠం శుభకరమైన శంఖం లాంటిది. నడుము ఉందా లేదా అనిపించేంత సన్నటిది. స్తనాల జంట కనువిందు చేస్తుంది. నుదురు అర్థచంద్రుడి కంటె అందమైనది. జడ మత్తెక్కిన తుమ్మెదల బారు లాంటిది. చూపులు మన్మథ బాణాలకి సాటైనది. కనుబొమలు మన్మథుని వింటి కొమ్ములు. ఆ సుందరి పలుకులు మనసును సంతోషపెట్టేవి. ఆమె మోము చంద్రబింబం లాంటిది.
35- see.
pallava vaibhavaaspadamulu padamulu;
          kanakaraMbhaatiraskaaru looru;
laruNaprabhaamanOharamulu garamulu;
          kaMbusauMdaryamaMgaLamu gaLamu;
mahita bhaavaabhaavamadhyaMbu madhyaMbu;
          chakShurutsavadaayi channudOyi;
parihasitaardhEMdu paTalaMbu niTalaMbu;
          jitamatta madhukarashrENi vENi;
aa.
bhaavajaashugamula praapulu choopulu;
kusumasharuni viMTi komalu bomalu;
chittatOShaNamulu cheluvabhaaShaNamulu;
jalajanayana mukhamu chaMdrasakhamu.
          అని = అని; ఇట్లు = ఈ విధముగ; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి; పుత్తెంచిన = చెప్పి పంపించిన; సందేశంబులున్ = వృత్తాంతములు; రూప = రూపము నందలి; సౌందర్య = అందము; ఆది = మున్నగు; విశేషంబులున్ = ప్రత్యేకతలను; బ్రాహ్మణుండు = విప్రుడు; హరి = కృష్ణుని; కిన్ = కి; విన్నవించి = చెప్పి; కర్తవ్యంబు = చేయదగ్గపని; ఎద్ది = ఏదైతే అది; చేయన్ = చేయవలెనని; అవధరింపుము = నిశ్చయించుకొనుము; అని = అని; సవరణగాన్ = తగ్గి,సౌమ్యముగా; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
          పల్లవ = చిగురాకుల యొక్క; వైభవ = గొప్పదనములకు; ఆస్పదములు = ఉనికిపట్లు; పదములున్ = పాదములు; కనక = బంగారపు; రంభా = అరటిబోదెలను; తిరస్కారులు = తిరస్కరించునవి; ఊరులు = తొడలు; అరుణ = ఎర్రనైన; ప్రభా = కాంతులతో; మనోహరములు = అందమైనవి; కరములు = చేతులు; కంబు = శంఖము వంటి; సౌందర్య = చక్కదనముచేత; మంగళము = శుభప్రదమైనది; గళము = కంఠము; మహిత = గొప్ప; భావాభావమధ్యంబు = ఉందోలేదో తెలియనిది {భావాభావమధ్యంబు - భావ(ఉందో) అభావ (లేనిది) మధ్యంబు (సందేహాస్పదమైనది), ఉందోలేదో తెలియనిది}; మధ్యంబు = నడుము; చక్షుః = కన్నులకు; ఉత్సవ = సంతోషమును; దాయి = ఇచ్చునవి; చన్ను = స్తనముల; దోయి = ద్వయము; పరిహసిత = ఎగతాళి చేయబడిన; అర్ధేందు = అర్ధచంద్రుల యొక్క; పటలంబు = సమూహము కలది; నిటలంబు = నుదురు; జిత = గెలువబడిన; మధుకర = తుమ్మెదల; శ్రేణి = సమూహములు వంటిది; వేణి = జడ.
          భావజ = మన్మథుని {భావజుడు - సంకల్పము చేత పుట్టువాడు, మన్మథుడు}; ఆశుగముల = బాణముల యొక్క; ప్రాపులు = ఉనికిపట్లు; చూపులు = దృష్టులు; కుసుమశరుని = మన్మథుని {కుసుమశరుడు - పుష్ప భాణములు కలవాడు, మన్మథుడు}; వింటి = ధనుస్సు యొక్క; కొమలు = కొసలు; బొమలు = కనుబొమ్మలు; చిత్త = మనస్సును; తోషణములు = సంతోషింపజేయునవి; చెలువ = అందగత్తె; భాషణములు = మాటలు; జలజనయన = పద్మాక్షి; ముఖము = ముఖము; చంద్ర = చంద్రబింబమునకు; సఖము = మిత్రము, వంటిది.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: