Wednesday, November 19, 2014

రుక్మిణీకల్యాణం – ఏ నీ గుణములు

25- వ.
అని యిట్లు లీలాగృహీతశరీరుండైన య ప్పరమేశ్వరుం డడిగిన ధరణీసురవరుం డతని కిట్లనియె దేవా! విదర్భదేశాధీశ్వరుండైన భీష్మకుండను రాజుగలండా రాజుకూఁతురు రుక్మిణి యను కన్యకా మణి గల ద య్యిందువదన నీకుం గైంకర్యంబు జేయం గోరి వివాహమంగళ ప్రశస్తం బయిన యొక్క సందేశంబు విన్నవింపు మని పుత్తెంచె నవదరింపుము.
26- సీ.
నీ గుణములు గర్ణేంద్రియంబులు సోఁక
          దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల
          ఖిలార్థలాభంబు లుగుచుండు
నే నీ చరణసేవ యే ప్రొద్దు చేసిన
          భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ
          డవిన బంధసంతులు వాయు
తే.
ట్టి నీ యందు నా చిత్త నవరతము
చ్చి యున్నది నీ యాన నాన లేదు,
రుణఁ జూడుము కంసారి! లవిదారి!
శ్రీయుతాకార! మానినీచిత్తచోర!
ఇలా ఆ పరమపురుషుడు అడగగా, రుక్మిణీ సందేశం తెచ్చిన బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు భగవాన్! విదర్భ దేశానికి రాజు భీష్మకుడు. ఆ రాజు కూతురు రుక్మిణి. ఆ అందమైన కన్య ఒక వివాహ మంగళంబైన గొప్ప సందేశం నీకు విన్నవించమని పంపింది. సావధానంగా విను.
శ్రీకృష్ణప్రభూ! కంసాది ఖలులను సంహరించేవాడ! మంగళాకారా! మనస్వినిల మనసులు దోచేవాడా! నీ గురించి చెవులలో పడితే చాలు దేహతాపాలన్నీ తీరిపోతాయి. నీ శుభ ఆకారం చూస్తే చాలు సకలార్థ లాభాలు కలుగుతాయి. నీ పాద సేవ చేసుకొంటే చాలు లోకోన్నతి దక్కుతుంది. భక్తిగా నీ నామస్మరణ ఎడతెగకుండా చేస్తే చాలు భవబంధా లన్నీ పటాపంచ లౌతాయి. అలాంటి నీ మీద మనసు పడ్డాను. నీ మీదొట్టు. సమయం లేదు. దయతో చిత్తగించు.
25- va.
ani yiTlu leelaagRiheetashareeruMDaina ya pparamEshvaruM DaDigina dharaNeesuravaruM Datani kiTlaniye “dEvaa! vidarbhadEshaadheeshvaruMDaina bheeShmakuMDanu raajugalaMDaa raajukooM~turu rukmiNi yanu kanyakaa maNi gala da yyiMduvadana neekuM gaiMkaryaMbu jEyaM gOri vivaahamaMgaLa prashastaM bayina yokka saMdEshaMbu vinnaviMpu mani putteMche navadariMpumu.
26- see.
E nee guNamulu garNEMdriyaMbulu sOM~ka
          dEhataapaMbulu deeRripOvu
nE nee shubhaakaara meekShiMpaM~ gannula
          kakhilaarthalaabhaMbu galuguchuMDu
nE nee charaNasEva yE proddu chEsina
          bhuvanOnnatatvaMbuM~ boMdaM~ galugu
nE nee lasannaama mE proddu bhaktitOM~
          daDavina baMdhasaMtatulu vaayu
tE.
naTTi nee yaMdu naa chitta manavaratamu
nachchi yunnadi nee yaana naana lEdu,
karuNaM~ jooDumu kaMsaari! khalavidaari!
shreeyutaakaara! maanineechittachOra!
          అని = అని; ఇట్లు = ఈ విధముగ; లీలా = విలాసముగా; గృహీత = గ్రహించిన; శరీరుండు = దేహము కలవాడు; ఐన = అయిన; = ఆ ప్రసిద్ధుడైన; పరమేశ్వరుండు = శ్రీకృష్ణుడు; అడిగినన్ = అడుగగా; ధరణీసుర = విప్ర; వరుండు = ఉత్తముడు; అతని = అతని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; దేవా = స్వామీ; విదర్భదేశ = విదర్భదేశమునకు; అధీశ్వరుండు = ప్రభువు; అయిన = ఐన; భీష్మకుండు = భీష్మకుడు; అను = అనెడి; రాజు = రాజు; కలండు = ఉన్నాడు; = ; రాజు = రాజు యొక్క; కూతురు = కుమార్తె; రుక్మిణి = రుక్మిణి; అను = అనెడి; కన్యక = కన్యకలలో; మణి = శ్రేష్ఠురాలు; కలదు = ఉన్నది; = ఆ యొక్క; ఇందువదన = చంద్రముఖి, రుక్మిణి; నీ = నీ; కున్ = కు; కైంకర్యంబున్ = సేవించుట; చేయన్ = చేయవలెనని; కోరి = కోరుకొని; వివాహ = పెండ్లికి సంబంధించిన; మంగళ = శుభకరము; ప్రశస్తంబు = శ్లాఘింపదగినది; అయిన = ఐన; ఒక్క = ఒకానొక; సందేశంబున్ = సమాచారమును; విన్నవింపుము = మనవిచేయుము; అని = అని; పుత్తెంచెను = పంపిచెను; అవధరింపుము = వినుము.
            = ఎట్టి; నీ = నీ యొక్క; గుణములున్ = గొప్పగుణములు {భగవంతుని గుణములు - 1సర్వజ్ఞత్వము 2సర్వేశ్వరత్వము 3సర్వభోక్తృత్వము 4సర్వనియంతృత్వము 5సర్వాంతర్యామిత్వము 6సర్వసృష్టత్వము 7సర్వపాలకత్వము 8సర్వసంహారకత్వము మొదలగునవి}; కర్ణేంద్రియంబులు = చెవులను; సోకన్ = తాకినంతనే; దేహ = శారీరక; తాపంబులు = బాధలు, తాపత్రయములు {తాపత్రయము - 1 ఆధ్యాత్మికము 2ఆదిదైవికము 3ఆదిభౌతికము అనెడి మూడు ఇడుములు}; తీఱిపోవున్ = నశించిపోవునో; = ఎట్టి; నీ = నీ యొక్క; శుభ = శోభనకరమైన; ఆకారమున్ = స్వరూపమును; ఈక్షింపన్ = చూచినచో; కన్నుల్ = కళ్ళ; కున్ = కు; అఖిల = సమస్తమైన; అర్థ = ప్రయోజనములు; లాభంబు = లభించుట; కలుగుచుండున్ = పొందుతుండునో; = ఎట్టి; నీ = నీ యొక్క; చరణ = పాదములను; సేవన్ = కెలచుటచే; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడు; చేసినన్ = చేసినచో; భువన = లోకమునందు; ఉన్నతత్వంబు = అధిక్యము; పొందగలుగు = లభించునో; = ఎట్టి; నీ = నీ యొక్క; లసత్ = మంచి; నామమున్ = పేరులను; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడు; భక్తి = భక్తి; తోన్ = తోటి; తడవినన్ = తలచిన ఎడల; బంధ = సంసారబంధముల {సంసారబంధములు - అష్టబంధములు, 1దయ 2జుగుప్స 3మోహము 4భయము 6సంశయము 7కులము 8శీలము}; సంతతులు = సమూహములన్ని; వాయున్ = తొలగునో; అట్టి = అటువంటి.
           నీ = నీ; అందున్ = ఎడల; నా = నా యొక్క; చిత్తము = మనస్సు; అనవరతము = ఎల్లప్పుడు; నచ్చి = ఇష్టపడి; ఉన్నది = ఉన్నది; నీ = నీ మీద; ఆన = ఒట్టు; నాన = సిగ్గుపడుట; లేదు = లేదు; కరుణన్ = దయతో; చూడుము = చూడు; కంసారి = శ్రీకృష్ణా {కంసారి - కంసుని సంహరించినవాడు, కృష్ణుడు}; ఖలవిదారి = శ్రీకృష్ణా {ఖలవిదారి - దుర్జనులను సంహరించువాడు, కృష్ణుడు}; శ్రీయుతాకార = శ్రీకృష్ణా {శ్రీయుతాకారుడు - సౌందర్యసంపదలతో కూడి యున్న వాడు, కృష్ణుడు}; మానినీచిత్తచోర = శ్రీకృష్ణా {మానినీచిత్తచోరుడు - స్త్రీల మనసులను అపహరించు వాడు, కృష్ణుడు}.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: