Wednesday, November 26, 2014

రుక్మిణీకల్యాణం – ప్రాణేశ నీమంజుభాషలు

33- సీ.
ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని
          ర్ణరంధ్రంబుల లిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగాలేని
          నులతవలని సౌంర్య మేల?
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని
          క్షురింద్రియముల త్వ మేల?
యిత! నీ యధరామృతం బానఁగాలేని
          జిహ్వకు ఫలరససిద్ధి యేల?
ఆ.
నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బ దేని ఘ్రాణ మేల?
న్యచరిత! నీకు దాస్యంబుజేయని
న్మ మేల? యెన్ని న్మములకు.
          శ్రీకృష్ణ! నీ మనోఙ్ఞమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు దండగ. పురుషోత్తమ! నీవు భోగించని వంటికి అంద మెందుకు దండగ. ప్రాణేశా! నిన్ను చూడలేని కళ్ళకి చూపెందుకు దండగ. ప్రభూ! నీ అధరామృతం అందని నాలుకకు రుచెందుకు దండుగ. పద్మాక్షా! నీ మెడలోని పూలహారం వాసన చూడలేని ముక్కు ఎందుకు దండగ. మహాత్మా! కృష్ణభగవాన్! ఎన్నిజన్మలకైనా నీ సేవచేయలేని దండగమారి జన్మ ఎందుకు. నాకు వద్దు.
33- see.
praaNEsha! nee maMju bhaaShalu vinalEni
          karNaraMdhraMbula kalimi yEla?
puruSharatnama! neevu bhOgiMpaM~gaalEni
          tanulatavalani sauMdarya mEla?
bhuvanamOhana! ninnuM~ boDagaanaM~gaa lEni
          chakShuriMdriyamula satva mEla?
dayita! nee yadharaamRitaM baanaM~gaalEni
          jihvaku phalarasasiddhi yEla?
aa.
neerajaatanayana! nee vanamaalikaa
gaMdha mabba dEni ghraaNa mEla?
dhanyacharita! neeku daasyaMbujEyani
janma mEla? yenni janmamulaku.”
          ప్రాణేశా = నా పాణమునకు ప్రభువా; నీ = నీ యొక్క; మంజు = మృదువైన; భాషలున్ = మాటలు; వినలేని = వినజాలని; కర్ణరంధ్రంబుల = చెవులు అనెడివి; కలిమి = ఉండి; ఏలన్ = ఎందుకు; పురుష = పురుషులలో; రత్నమ = శ్రేష్ఠుడా; నీవున్ = నీవు; భోగింపగా = రమించుట; లేని = లేనట్టి; తను = దేహ మనెడి; లత = తీగ; వలని = అందలి; సౌందర్యము = అందము; ఏలన్ = ఎందుకు; భువన = ఎల్ల లోకములను; మోహన = మోహింప జేయువాడ; నిన్నున్ = నిన్ను; పొడగానగాలేని = చూడజాలని; చక్షురింద్రియముల = కళ్ళకున్; సత్వము = పటుత్వము; ఏలన్ = ఎందుకు; దయిత = ప్రియా; నీ = నీ యొక్క; అధరామృతంబున్ = పెదవుల తీయదనమును; పానగాలేని = ఆస్వాదించజాలని; జిహ్వ = నాలుక; కున్ = కు; ఫల = పండ్లను; రస = రుచిచూచుట; సిద్ధి = లభించుట; ఏలన్ = ఎందుకు.
          నీరజాతనయన = పద్మాక్షుడా, కృష్ణా; నీ = నీ యొక్క; వనమాలికా = పూల చిగుళ్ల మాల యొక్క; గంధము = సువాసన; అబ్బదేని = లభింపజాలని; ఘ్రాణము = ముక్కు; ఏలన్ = ఎందుకు; ధన్య = కృతార్థమైన; చరిత = నడవడి కలవాడా; నీ = నీ; కున్ = కు; దాస్యంబు = సేవ; చేయని = చేయజాలని; జన్మము = జీవించుట; ఏలన్ = ఎందుకు; ఎన్ని = ఎన్ని; జన్మములకు = జన్మలెత్తినను {జన్మలెత్తు - పునర్జన్మలు పొందుట}.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: