Thursday, November 20, 2014

రుక్మిణీకల్యాణం – ధన్యున్ లోకమనోభిరాము

27- శా.
న్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ
న్య శ్రీ బల దాన శౌర్య కరుణాసంశోభితున్ నిన్ను నే
న్య ల్గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా
న్యానేకపసింహ! నా వలననే న్మించెనే మోహముల్.
          ముకుందా! రాజులనే మత్తేభాల పాలిటి సింహమా! నీవు ధన్యుడవు. అందరి మనసులు అలరించే వాడువు. కులం, రూపం, యౌవనం, సౌజన్యం, శ్రీ, బలం, దాన, పరాక్రమం, కరుణాది సకల సుగుణ సంశోభితుడవు. అలాంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉంటారు. పూర్వం కాంతామణి లక్ష్మీ దేవి నిన్ను వరించ లేదా. లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదానికే ఇలా మోహం పుట్టిందా ఏమిటి.
27- shaa.
dhanyun lOkamanObhiraamuM~ gula vidyaa roopa taaruNya sau
janya shree bala daana shaurya karuNaasaMshObhitun ninnu nE
kanya lgOraru? kOradE munu ramaakaaMtaa lalaamaMbu raa
janyaanEkapasiMha! naa valananE janmiMchenE mOhamul.
          ధన్యున్ = కృతార్థుండు; లోక = లోకుల; మనః = మనసులను; అభిరామున్ = నచ్చువాడు; కుల = వంశముచేత; విద్యా = విఙ్ఞానముచేత; రూప = సౌందర్యముచేత; తారుణ్య = యౌవనశోభచేత; సౌజన్య = మంచితనముచేత; శ్రీ = సంపదలచేత; బల = శక్తిచేత; దాన = ఈవిచేత; శౌర్య = మిక్కలి వీరత్వముచేత; కరుణా = దయచేత; సంశోభితున్ = మిక్కలి ప్రకాశవంతుడు; నిన్నున్ = నిన్ను; = ; కన్యల్ = కన్యలుమాత్రము; కోరరు = కావలనుకొనరు; కోరదే = వరించలేదా; మును = పూర్వము; రమా = లక్ష్మీదేవి యనెడి; కాంతాలలామంబు = శ్రేష్ఠురాలు; రాజ = రాజులలో; అన్య = శత్రువులనెడి; అనేకప = ఏనుగులకు; సింహ = సింహమువంటివాడ; నా = నా ఒక్కర్తె; వలననే = యందే; జన్మించెనే = పుట్టినవా, పుట్టలేదు; మోహముల్ = మోహించుటలు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: