7- క.
భూషణములు
చెవులకు బుధ
తోషణము
లనేక జన్మదురితౌఘ విని
శ్శోషణములు
మంగళతర
ఘోషణములు
గరుడగమను గుణభాషణముల్.
విష్ణుకథలు చెవులకు కర్ణాభరణాలు, బుద్ధిమంతు
లకు సంతోషం కలిగించేవి, జన్మజన్మ పాపాలని పోగొట్టేవి, మిక్కిలి శుభకరమైనవి.
7- ka.
bhooShaNamulu chevulaku budha
tOShaNamu lanEka janmaduritaugha vini
shshOShaNamulu maMgaLatara
ghOShaNamulu garuDagamanu guNabhaaShaNamul.
భూషణములు = అలంకారములు; చెవుల్ = శ్రవణేంద్రియముల; కున్ = కు; బుధ = ఙ్ఞానులకు; తోషణముల్ = సంతోషమునిచ్చునవి; అనేక = పెక్కు; జన్మ = జన్మలకు చెందిన; దురిత = పాపముల; ఓఘ = సమూహములను; వినిశ్శోషణములు = మిక్కలి ఆవిరి జేయునవి; మంగళతర = మిక్కిలి శుభకరమైన; ఘోషణములు = పులుకులు; గరుడగమను = విష్ణుమూర్తి
యొక్క; గుణ = దివ్యగుణములు; భాషణముల్ = తెలిపెడి మాటలు.
:
: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment