5- వ.
అనిన
రాజిట్లనియె “మున్ను రాక్షసవివాహంబున స్వయంవరం బునకు
వచ్చిన హరి రుక్మిణిం గొని పోయె నని పలికితివి; కృష్ణుండొక్కరుం
డెవ్విధం బున సాళ్వాదుల జయించి తన పురంబు నకుం జనియె; అదియునుం
గాక.
అప్పుడు పరీక్షిత్తు ఇలా అడిగాడు “స్వయంవరాని కొచ్చిన కృష్ణుడు రాక్షస వివాహ పద్దతిలో
రుక్మిణిని తన ద్వారకాపట్టణానికి తీసుకుపోయేడని చెప్పావు. కృష్ణుడు ఒంటరిగా సాళ్వుడు
మొదలైనవారి నందరిని ఎలా జయించాడు. ఇంకా
5- va.
anina raajiTlaniye “munnu raakShasavivaahaMbuna
svayaMvaraM bunaku vachchina hari rukmiNiM goni pOye nani palikitivi;
kRiShNuMDokkaruM DevvidhaM buna saaLvaadula jayiMchi tana puraMbu nakuM janiye;
adiyunuM gaaka.
అనినన్ = అనగా; రాజు = పరీక్షిన్మహారాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మున్ను = ఇంతకు ముందు; రాక్షస = రాక్షసము అనెడి {రాక్షసము - బలాత్కారమున కన్యను అపహరించి
వివాహమాడు పద్ధతి}; వివాహంబునన్ = వివాహపద్ధతిని {అష్టవిధవివాహములు - 1బ్రాహ్మము 2దైవము 3ఆర్షము 4ప్రాజాపత్యము 5ఆసురము 6గాంధర్వము 7రాక్షసము
8పైశాచము}; స్వయంవరంబున్ = స్వయంవరమున {స్వయంవరము - కన్య ఇష్టానుసారము భర్తను
ఎంచుకొని వరించుట}; కున్ = కు; వచ్చిన = వచ్చినట్టి; హరి = కృష్ణుడు; రుక్మిణిన్ = రుక్మిణిని; కొనిపోయెన్ = తీసుకెళ్ళెను; అని = అని; పలికితివి = చెప్పితివి; కృష్ణుండు = కృష్ణుడు; ఒక్కరుండున్ = ఒక్కడు; ఏ = ఏ; విధంబునన్ = విధముగా; సాళ్వ = సాళ్వుడు; ఆదులన్ = మున్నగువారిని; జయించి = గెల్చి; తన = తన యొక్క; పురంబున్ = పట్టణమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అదియునున్ = అంతే; కాక = కాకుండా.
:
: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment