15- వ.
ఇట్లు
రుక్మి రుక్మరథ రుక్మబాహు రుక్మకేశ రుక్మనేత్రు లను నేవురకుం జెలియలైన రుక్మిణీదేవి
దన యెలప్రాయంబున.
16- క.
తన
తండ్రి గేహమునకుం
జనుదెంచుచునున్న
యతిథిజనులవలనఁ గృ
ష్ణుని రూప
బల గుణాదులు
విని
కృష్ణుఁడు దనకుఁ దగిన విభుఁడని
తలఁచెన్.
ఇలా రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులనే ఐదుగురికి ముద్దుల
చెల్లెలైన రుక్మిణి నవ యౌవనంలో ప్రవేశించింది.
పుట్టింటికి వచ్చే పోయే వాళ్ళ వల్ల కృష్ణుడి అందం బలం సుగుణాలు తెలిసి భర్తగా
వరించింది.
15- va.
iTlu rukmi
rukmaratha rukmabaahu rukmakEsha rukmanEtru lanu nEvurakuM jeliyalaina
rukmiNeedEvi dana yelapraayaMbuna.
16- ka.
tana taMDri
gEhamunakuM
janudeMchuchununna
yatithijanulavalanaM~ gRi
ShNuni roopa bala
guNaadulu
vini kRiShNuM~Du
danakuM~ dagina vibhuM~Dani talaM~chen.
ఇట్లు = ఈ విధముగ; రుక్మి = రుక్మి; రుక్మరథ = రుక్మరథుడు; రుక్మబాహు = రుక్మబాహువు; రుక్మకేశ = రుక్మకేశుడు; రుక్మనేత్రులు = రుక్మనేత్రుడులు; అను = అనెడి; ఏవురు = ఐదుగుర (5); కున్ = కు; చెలియలి = చెల్లెలు; ఐన = అయినట్టి; రుక్మిణీ = రుక్మిణి అనెడి; దేవి = దేవి; తన = తన యొక్క; యెల = లేత; ప్రాయంబునన్ = యౌవనమునందు.
తన = తన యొక్క; తండ్రి = తండ్రి యొక్క; గేహమున్ = ఇంటి; కున్ = కి; చనుదెంచుచున్ = వస్తూ; ఉన్న = ఉన్నట్టి; అతిథి = అతిథులుగావచ్చు; జనుల = వారి; వలనన్ = ద్వారా; కృష్ణుని = కృష్ణుని యొక్క; రూప = రూపసౌందర్యము; బల = శక్తిసామర్థ్యములు; గుణ = సుగుణములు; ఆదులున్ = మొదలగువాటిని; విని = విని; కృష్ణుడు = కృష్ణుడు; తన = ఆమె; కున్ = కు; తగిన = సరిపడు; విభుడు = భర్త; అని = అని; తలచెన్ = ఎంచెను.
:
: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment