24- ఉ.
ఎవ్వని
దేశమం దునికి యెవ్వనిచేఁ గుశలంబు గల్గు మీ
కెవ్వని రాజ్యమందుఁ
బ్రజలెల్ల సుఖింతురు వాఁడు మత్ప్రియిం
డివ్వనరాశి
దుర్గమున కే లరుదెంచితి రయ్య! మీరు? లే
నవ్వులుగావు; నీ తలఁపునం గల
మే లొనరింతు ధీమణీ.”
బుద్దిశాలీ! మీరే దేశంలో ఉంటారు. ఎవని
రాజ్యంలో నైతే మీరు కులాశాగా ఉంటారో, ప్రజ లంతా సుఖంగా ఉంటారో వాడు మాకు ఇష్టుడు.
సముద్రంలో ఉన్న ఈ కోట లోకి రావటం అంత సుళువైన పని కాదు. మీరెలా వచ్చేరు. మీరు
కోరిన మేలు తప్పక చేకూరుస్తాను.” అని శ్రీకృష్ణుడు సందేశం పట్టుకొచ్చిన విప్రుని
పలకరించాడు.
24- u.
evvani dEshamaM duniki
yevvanichEM~ gushalaMbu galgu mee
kevvani raajyamaMduM~
brajalella sukhiMturu vaaM~Du matpriyiM
Divvanaraashi durgamuna
kE larudeMchiti rayya! meeru? lE
navvulugaavu; nee
talaM~punaM gala mE lonariMtu dheemaNee.”
ఎవ్వని = ఎవరి; దేశము = రాజ్యము; అందున్ = లో; ఉనికి = ఉండుట; ఎవ్వని = ఎవరి; చేన్ = వలన; కుశలంబున్ = క్షేమము; కల్గున్ = కలుగును; మీ = మీ; కున్ = కు; ఎవ్వని = ఎవరి; రాజ్యము = రాజ్యము; అందున్ = లో; ప్రజలు = జనులు; ఎల్లన్ = అందరు; సుఖింతురు = సుఖించెదరు; వాడు = అతడు; మత్ = నా యొక్క; ప్రియుండు = ఇష్టుడు; ఈ = ఈ; వనరాశి = సముద్రపు; దుర్గమున్ = కోటకు; కున్ = కు; ఏల = ఎట్లు; అరుదెంచితిరి = వచ్చిరి; అయ్య = తండ్రి; మీరున్ = మీరు; లే = లేత; నవ్వులు = నవ్వులకు; కావు = చెప్పినవికావు; నీ = నీ యొక్క; తలపునన్ = మనసునందు; కల = ఉన్న; మేలున్ = మంచివాటిని; ఒనరింతున్ = చేసెదను; ధీమణీ = విఙ్ఞులలో ఉత్తముడా.
:
: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment