Saturday, December 28, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 154

bhramaraa

10.1-1458-మ.
భ్రరా! దుర్జనమిత్ర! ముట్టకుము మా పాదాబ్జముల్ నాగర
ప్రదాళీ కుచ కుంకు మాంకిత లసత్ప్రాణేశ దామప్రసూ
రం దారుణి తాననుండ వగుటన్ నాథుండు మన్నించుఁగా
మున్నేఁపుచుఁ బౌరకాంతల శుభాగారంబులన్నిత్యమున్.

          ధూర్తుల మిత్రుడ వైన ఓ మధుపమా! మా పాదపద్మాలు తాకకు; మా ప్రాణవల్లభుని పూమాలల యందలి మకరందం గ్రోలి, అక్కడ అంటిన మథురానగరపు కాంతల స్తనకుంకుమలుతో ఎర్రబారిన నీ మోము (అందాన్ని) చూసి అతడు మన్నిస్తాడేమో గాని; మమ్మల్ని విరహాలతో వేపుకుతింటు, అక్కడ నగర కాంతల శోభనగృహాలలో కులుకుతుండే నిన్ను మేము మాత్రం మన్నించము.
భ్రమరగీతాలు అని శ్రీకృష్ణుని దూతగా వచ్చిన యుద్ధవునితో గోపకాంతలు  తుమ్మెద వంక పెట్టి పలికిన పలుకులు 10 పద్యాలలో వర్ణించారు పోతనామాత్యులవారు. మధుర భక్తితో కూడిన ప్రపత్తిని ఒలికించిన వీనిలోని కవితా మాధురి ఎనలేనిది. ఆ రసస్పోరక పద్యాలలో మొదటిది ఇది.
10.1-1458-ma.
bhramaraa! durjanamitra! muTTakumu maa paadaabjaatamul naagara
pramadaaLee kucha kuMku maaMkita lasatpraaNaeSa daama prasoo
na maraM daaruNi taananuMDa vaguTan naathuMDu manniMchu@Mgaa
ka mamu nnae@Mpuchu@M baurakaaMtala SubhaagaaraMbula nnityamun.

          భ్రమరా = తుమ్మెదా {భ్రమరము - భ్రమించుచు నుండునది, తుమ్మెద, భ్రమింప చేయునది}; దుర్జన = చెడ్డవారికి; మిత్ర = స్నేహితు డైన వాడ; ముట్టకుము = తాక వద్దు; మా = మా యొక్క; పాద = పాదములు అనెడి; అబ్జముల్ = పద్మములను; నాగర = పట్టణపు; ప్రమద = స్త్రీల {ప్రమద - మిక్కలి యౌవన మదము కలామె}; ఆళీ = సమూహముల యొక్క; కుచ = స్తనము లందలి; కుంకుమ = కుంకుమ; అంకిత = అంటినట్టి; లసత్ = చక్కటి; ప్రాణేశు = మనోనాయకుని; దామ = పూలదండ లోని; ప్రసూన = పువ్వుల యొక్క; మరంద = మకరందము చేత; అరుణిత = ఎర్ర నైన; ఆననుండవు = మోము కలవాడవు; అగుటన్ = అగుటచేత; నాథుండు = ప్రభువు; మన్నించుగాక = ఆదరించవచ్చు గాక; మమ్మున్ = మమ్ములను; ఏపుచున్ = తపింప జేయుచు; పౌర = పురము లోని; కాంతల = స్త్రీల; శుభ = మేలైన; ఆగారంబులన్ = ఇండ్ల యందు; నిత్యమున్ = ప్రతిదినము.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: