Wednesday, December 25, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 151

havaroopivi


3-427-క.
రూపివి హవనేతవు
భోక్తవు నిఖిల హవఫ లాధారుఁడవున్
రక్షకుఁడవు నగు నీ
వితథముగ నుతు లొనర్తు య్య ముకుందా!

          భూమ్యుద్ధరణ చేసిన దేవదేవుని దేవతలు స్తుతిస్తున్నారు. యజ్ఞ స్వరూప మైనవాడవు, యజ్ఞ కర్తవు, యజ్ఞ భోక్తవు, సర్వ యజ్ఞాల ఫలప్రధాతవు, యజ్ఞ రక్షకుడవు అయిన ఓ ముక్తిప్రధాత! యజ్ఞవరాహమూర్తి! నిన్ను హృదయపూర్వకంగా కొనియాడుతున్నాము.

3-427-ka.
havaroopivi havanaetavu
havabhOktavu nikhila havapha laadhaaru@MDavun
havarakshaku@MDavu nagu nee
kavitatamuga nutu lonartu mayya mukuMdaa!

          హవ = హోమము యొక్క; రూపివిన్ = రూపము కలవాడవు; హవ = హోమము యొక్క; నేతవు = నాయకుడవు; హవ = హోమము యొక్క; భోక్తవున్ = స్వీకరించు వాడవు; నిఖిల = సమస్త మైన; హవ = హోమముల యొక్క; ఫల = ఫలితములకు; ఆధారుడవున్ = కారణము అయిన వాడవు; హవ = హోమముల యొక్క; రక్షకుడవున్ = రక్షించు వాడవును; అగు = అయిన; నీకు = నీకు; అవితథముగన్ = సత్యముగా; నుతులు = స్తోత్రములు; ఒనర్తుము = చేయుదుము; అయ్య = తండ్రి; ముకుందా = భగవంతుడా {ముకుందుడు మోక్షమును ఇచ్చువాడు, విష్ణుమూర్తి}.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

1 comment:

dokka srinivasu said...

Respected V.S.Rao gariki namaskaramu.

Sir ippude meeru naa blagulo ichina telugu comment choosanu. Sir chaalaa dhanyavadamulu(thanks) for your comment.

Sir these are some other posts please look and give your english comments.

http://indian-heritage-and-culture.blogspot.in/2013/09/lamps-of-india.html

http://indian-heritage-and-culture.blogspot.in/2013/12/the-ramakien-thailand-ramayana.html

http://indian-heritage-and-culture.blogspot.in/2013/03/kerala-mural-paintings.html

Rao garu nenu blogutho paatu school and college pillalaki mana Bharatiya samskruti mariyu sampradayamula meeda seminarlu kooda isthunnanu. Ippati varaku 2 seminarlu ichanu.

Ivi naa 2 seminarula linkulu.

http://indian-heritage-and-culture.blogspot.in/2013/02/my-first-seminar-on-indian-heritage-and.html

http://indian-heritage-and-culture.blogspot.in/2013/07/my-second-seminar-on-indian-heritage.html

Rao garu mee free timelo above links annee koodaa choosi manchi inspirational comments (sandesamulani) english lo ivvagalaru.

Alage meeru naa bloguki member gaa join avutharu ani mee snehithulaki kooda naa bloguni parichayamu chestharu ani aasisthunnanu.