maralupu
10.1-513-క.
మరలుపు మనియెడు కర్తయు
మరలించు కుమారకులును మరలెడి క్రేపుల్
పరికింపఁ దానయై హరి
మరలం జనె లీలతోడ మందకు నధిపా!
“ఇక ఆవుదూడల్ని ఇళ్ళకి
మళ్ళించండి” అని చెప్తున్న కృష్ణుడు; దూడలను
మళ్ళిస్తున్న ఆ గొల్ల పిల్లలు; అలా మళ్ళుతున్న దూడలు; అన్నీ తానే
అయ్యి ఆ లీలాగోపాలుడు తమ బృందావనానికి తిరిగి వెళ్ళిపోయాడు.
బ్రహ్మదేవుడు దూడల్ని వాటిని కాస్తున్న గొల్ల పిల్లల్ని సంవత్సరం
పాటు దాచేసాడు; కృష్ణుడు అది గ్రహించి తను కృష్ణుని రూపుతోనే ఉండి, తానే
తోటి గోపాల బాలురు, ఆవుదూడలు రూపాలను ధరించి ఎవరికి అనుమానం రాకుండ ఆ సంవత్సరం
గడిపి; బ్రహ్మ గర్వం సర్వం భంగం చేసాడు; అలా
అడవిలో మేత కెళ్ళిన దూడల, కాస్తున్న బాలుర రూపాలతో సాయంకాలం ఇళ్ళకు బయలుదేరిన కృష్ణుని
మహిమ వర్ణిస్తున్న ఎంతో అద్భుతమైన పద్యం ఇది.
10.1-513-ka.
maralupu
maniyeDu kartayu
maraliMchu
kumaarakulunu maraleDi kraepul
parikiMpa@M
daanayai hari
maralaM jane
leelatODa maMdaku nadhipaa!
మరలుపుము = మళ్ళించు; అనియెడు = అనెడి; కర్త = చెప్పేవాడు; మరలించు = మళ్లించెడి; కుమారకులును = బాలురు; మరలెడి = మళ్ళెడి; క్రేపుల్ = ఆవుదూడలు; పరికింపన్ = పరిశీలించి చూసినచో; తాన = తనే; ఐ = అయ్యి; హరి = కృష్ణుడు; మరలన్ = వెనుకకు; చనెన్ = వెళ్ళిపోయెను; లీల = విలాసము; తోన్ = తో; మందకున్ = బృందావనానికి; కున్ = కి; అధిపా = రాజా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment