onaran
1-21-మ.
ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.
బమ్మరె పోతనామాత్యులు భాగవతాన్ని తెనిగించడాని పూనుకున్న విధం తెలుపుకుంటు – ఇంతకు పూర్వం
నన్నయ భట్టారకుడు, తిక్కన సోమయాజులు మున్నగు కవీంద్రులు సంస్కృతంలో ఉన్న పురాణాలు గ్రంధాలు
ఆంధ్రీకరించారు. కాని నా పూర్వజన్మ ఫలం ఎంత గొప్పదో కాని, ఆ మహానుభావులు ఎవరు కూడ
భాగవతాన్ని ఆంధ్రీకరించలేదు. బహుశా నా కోసమే అట్టేపెట్టి ఉంచారేమో. ఈ మహా గ్రంధాన్ని
నేను ఆంధ్రీకరించి పునర్జన్మ అన్నది లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను.
1-21-ma.
onaran
nannaya tikkanaadi kavu lee yurviM buraaNaavaLul
tenu@MguM
jaeyuchu matpuraakRta SubhaadhikyaMbu daa neTTidO
tenu@MguM
jaeyaru munnu bhaagavatamun deeniM deniMgiMchi naa
jananaMbun
saphalaMbu@M jaeseda@M bunarjanmaMbu laekuMDa@Mgan.
ఒనరన్ = (రచనలు) చేసేటప్పుడు; నన్నయ = నన్నయ; తిక్కన = తిక్కన; ఆది = మొదలైన; కవులు = కవులు; ఈ = ఈ; ఉర్విన్ = భూమ్మీద; పురాణ = పురాణ {పురాణలక్షణములు - సర్గము, ప్రతిసర్గము,
వంశము,
మన్వంతరము,
వంశానుచరితము}; ఆవళుల్ = సమూహములు; తెనుఁగు = ఆంధ్రీకరణ; చేయుచున్ = చేస్తూ; మత్ = నాయొక్క; పురా = పూర్వ జన్మలలో; కృత = చేసిన; శుభ = పుణ్యపు; అధిక్యంబు = గొప్పతనం; తాన్ = అది; ఎట్టిదో = ఎలాంటిదో కాని; తెనుఁగు = ఆంధ్రీకరణ; చేయరు = చేయలేదు; మున్ను = ఇంతకు ముందుగ; భాగవతమున్ = భాగవతాన్ని; దీనిన్ = దీనిని; తెనింగించి = ఆంధ్రీకరించి; నా = నాయొక్క; జననంబున్ = జన్మని; సఫలంబు = సార్థకము; చేసెదన్ = చేసుకుంటాను; పునః = పునః; జన్మంబున్ = జన్మమును; లేకుండఁగన్ = లేకుండే లాగ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment