baaluM Deeta@MDu
10.1-687-శా.
బాలుం డీతఁడు మంచివాఁడనుచుఁ జెప్పన్రాము క్రూరుండు
దు
శ్శీలుండౌ నవునైన నేము సుభగశ్రీఁ బాసి వైధవ్య దు
ష్టాలంకారముఁ బొంద నోడెద మనాథాలాప మాలింపవే?
చాలున్ నీ పద తాండవంబు; పతిబిక్షం బెట్టి రక్షింపవే?
కాళీయమర్థన సందర్భంలో నాగకాంతలు శ్రీకృష్ణుని తమ భర్తని
రక్షింప మని వేడుకుంటున్నారు – ఈ కాళీయుడు అమాయకుడు, మంచివాడు అనడం లేదు. నిజమే.
ఇతడు క్రూరుడు, దుష్టుడు. అయినా మేము సౌభాగ్యాన్ని పోగొట్టుకొని అసహ్య రూపాలతో
ఉండే వైధవ్యం పొందలేము. మేము అనాథలము. మా దీనాలాపాలను మన్నించు. ఇక నీ పాదతాడనాలు
చాలించు. పతిబిక్ష పెట్టి మమ్ము పాలించు.
10.1-687-Saa.
baaluM
Deeta@MDu maMchivaa@MDanuchu@M jeppanraamu krooruMDu du
SSeeluMDau
navunaina naemu subhagaSree@M baasi vaidhavya du
shTaalaMkaaramu@M
boMda nODeda manaathaalaapa maaliMpavae?
chaalun
nee pada taaMDavaMbu; patibikshaM beTTi rakshiMpavae?
బాలుండు =
అమాయకుడు; ఈతడు = ఇతగాడు;
మంచివాడు = యోగ్యుడు;
అనుచున్ = అని;
చెప్పన్ = చెప్పుటకు;
రాము = వచ్చిన
వారము కాము; క్రూరుండు =
చెడ్డ మనసు కల వాడు; దుశ్శీలుండున్ = చెడు
నడవడిక గల వాడు; ఔనవున్ =
అవును నిజమే; ఐనన్ = అయినప్పటికి;
నేము = మేము;
సుభగ = అయిదవతన
మను; శ్రీన్ =
సంపదను; పాసి = తొలగి;
వైధవ్య = వైధవ్య
మనెడి; దుష్ట =
చెడ్డ; అలంకారమున్ = అలంకారహీనమును;
పొందన్ = పొందుటకు;
ఓడెదము = భయపడుచున్నాము;
అనాథ = నీవు
తప్ప దిక్కులేని వారి; ఆలాపమున్ = వేడ్కొనుటను;
ఆలింపవే = వినుము;
చాలున్ = ఇక
చాలును; నీ = నీ యొక్క; పద = అడుగుల;
తాండవంబు = లయ
బద్ద ప్రక్షేపములు; పతిబిక్షన్ =
భర్త అనెడి బిక్షను; పెట్టి = అనుగ్రహించి;
రక్షింపవే = కాపాడుము.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment