నిరయమునకును (nirayamunakunu)
8-644-ఆ.
నిరయమునకును బ్రాప్త నిగ్రహంబునకును
బదవిహీనతకును బంధనమున
కర్థ భంగమునకు నఖిల దుఃఖమునకు
వెఱవ దేవ! బొంక వెఱచినట్లు.
భగవాన్! నరకానికి పోడం
కన్నా, శిక్షింపపడటం కన్నా, ఉన్నతమైన పదవి పోడం కన్నా, బంధింపబడటం కన్నా, సర్వ
సంపదలు నశించటం కన్నా, కష్టాలు అన్నీ రాడం కన్నా కూడ అసత్యం చెప్పడానికే ఎక్కువ
భయపడతాను సుమా.
ఇస్తానన్న మూడో అడగు మేర స్థలం చూప మన్న త్రివిక్రమావతారుడితో
బలిచక్రవర్తి “నా నోట్లోంచి అసత్యం రానే రాదు” అని
చెప్తూ పలికిన పలుకులు ఇవి. ఇది పోతన గారి బలిచక్రవర్తి సత్య నియతి, పాత్రపోషణ.
8-644-aa.
nirayamunakunu
braapta nigrahaMbunakunu
badaviheenatakunu
baMdhanamuna
kartha
bhaMgamunaku nakhila du@hkhamunaku
veRava daeva!
boMka veRachinaTlu.
నిరయమున్ = నరకమున; కునున్ = కు; ప్రాప్త = కలిగిన; నిగ్రహంబున్ = శిక్ష; కునున్ = కు; పద = పదవి, అధికారం; విహీనత = పోవుట; కునున్ = కు; బంధనమున్ = బంధింపబడుట; కున్ = కు; అర్థ = సంపదల; భంగమున్ = నశించినందు; కునున్ = కు; అఖిల = సమస్త మైన; దుఃఖమున్ = దుఃఖముల; కున్ = కు; వెఱవన్ = బెదరను; దేవ = భగవంతుడా; బొంక = అబద్దమాడుటకు; వెఱచిన్ = బెదరెడి; అట్లు = విధముగా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment