Monday, December 2, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 129



chitramuga

2-156-క.
చిత్రముగ భరత లక్ష్మణ
త్రుఘ్నుల కర్థి నగ్రన్ముం డగుచున్
ధాత్రిన్ రాముఁడు వెలసెఁ బ
విత్రుఁడు దుష్కృత లతా లవిత్రుం డగుచున్.
          ఆ శ్రీరామచంద్రునిగా అవతరిస్తూ, భరత లక్ష్మణ శత్రుఘ్నులకు అన్నగా జన్మించాడు. భూలోకంలో పరమ పవిత్రుడుగా, పాపాలనే లతలను కోసేసే కొడవలి వంటి వాడుగా ప్రసిద్ధికెక్కాడు.
2-156-ka.
chitramuga bharata lakshmaNa
Satrughnula karthi nagrajanmuM Daguchun
dhaatrin raamu@MDu velase@M ba
vitru@MDu dushkRta lataa lavitruM Daguchun.
          చిత్రముగ = బహు చక్కగా; భరత = భరతుడు; లక్ష్మణ = లక్ష్మణుడు; శత్రుఘ్నులన్ = శత్రుఘ్నుల; కున్ = కి; అర్థిన్ = కోరి; అగ్ర = అన్నగ (ముందు); జన్ముండు = పుట్టినవాడు; అగుచున్ = అగుచు; ధాత్రిన్ = భూమిమీద; రాముఁడు = శ్రీరాముడు; వెలసెఁన్ = అవతరించెను; పవిత్రుఁడు = పవిత్రమైన వాడు; దుష్కృతన్ = పాపములు అను; లతా = లతలకు; లవిత్రుండు = కొడవలి వంటి వాడు; అగుచున్ = అగుచు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: