nammiti
10.1-1744-ఉ.
నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! నిన్
నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!
రుక్మిణి, స్వయంవర సందర్భంలో
గుడికి వెళ్ళి పార్వతిని పూజించి ప్రార్థిస్తోంది – అమ్మా గౌరీదేవి! శాశ్వతులు
ఆదిదంపతులు ఐన మిమ్మల్ని పార్వతీ పరమేశ్వరులను మదిలో నమ్ముకొని ఉంటాను. భక్తితో కొలుస్తూ
ఉంటాను. మీకు తెలుసు కదా. గొప్ప గొప్ప అమ్మలలో మేటివి. సముద్రమంత దయ చూపే తల్లివి.
కృష్ణుని నాకు భర్తగా కావించు తల్లీ! నిన్ను నమ్ముకున్న వారికి ఎప్పటికి చెరుపు
ఉండదు గదమ్మా! ఈశ్వరీ!
10.1-1744-u.
nammiti naa
manaMbuna sanaatanu laina yumaamahaeSulan
mimmu@M
buraaNadaMpatula maelu bhajiMtu@M gadamma! maeTi pe
ddamma!
dayaaMburaaSivi gadamma! hariM bati@M jaeyumamma! ni
nnamminavaari
kennaTiki naaSamu laedu gadamma! yeeSvaree!
నమ్మితిన్ = దిక్కని విశ్వసించాను; నా = నా యొక్క; మనంబునన్ = మనసు నందు; సనాతనులు = శాశ్వతులు; ఉమా = పార్వతీ {ఉమ - అనత్యీత్యుమా
అవసంరక్షణే (వ్యుత్పత్తి), రక్షించునామె, పార్వతి}; మహేశులన్ = పరమేశ్వరులను {మహేశుడు – మహాంశ్ఛాసా వీశ్వరశ్చ మహేశ్వరః (వ్యుత్పత్తి), దేవతలలో
శ్రేష్ఠుడు, శివుడు}; మిమ్మున్ = మిమ్ములను; పురాణదంపతులన్ = పురాతనమైన దంపతుల; మేలు = చక్కగా; భజింతున్ = పూజించెదను; కదా = కదా; అమ్మ = తల్లీ; మేటి = గొప్ప; పెద్ధమ్మ = పెద్దతల్లీ{మేటిపెద్దమ్మ – ఇచ్ఛా, జ్ఞాన, క్రియా పరా శక్తుల కెల్ల ప్రధానమైన
ఆదిశక్తి, దేవతలలో శ్రేష్ఠురాలు, దుర్గ}; దయా = దయకు; అంబురాశివి = సముద్రము వంటి యామెవు; కదా = కదా; అమ్మ = తల్లీ; హరిన్ = కృష్ణుని; పతిన్ = భర్తగా; చేయుము = కావింపుము; అమ్మ = తల్లీ; నిన్నున్ = నిన్ను; నమ్మిన = విశ్వసించిన; వారి = వారల; కిన్ = కి; ఎన్నటికిన్ = ఎప్పటికి; నాశము = చెరుపు; లేదు = లేదు; కద = కదా; అమ్మ = తల్లి; ఈశ్వరీ = పార్వతీదేవి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment