Friday, December 27, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 153

chani chani

3-504-చ.
నిచని కాంచి రంత బుధత్తము లంచిత నిత్య దివ్య శో
విభవాభిరామముఁ బ్రన్న జన స్తవనీయ నామమున్
న విరామమున్ సుజన న్నుత భూమము భక్తలోక పా
గుణ ధామముంబురలలామముఁజారువికుంఠధామమమున్

          అలా వెళ్ళిన ఆ జ్ఞానశ్రేష్ఠులకు వైభవోపేత మైన వైకుంఠం గోచరమైంది. అది నిత్యము దివ్యము శాశ్వతము అయిన శోభలతో ప్రకాశిస్తున్నది. అత్యంత మనోహరంగా ఉన్నది. ప్రపన్ను లైన భక్తులకు భజింపదగినది. అక్కడకు చేరిన పుణ్యాత్ములకు పునర్జన్మలు లేకుండునది. ఆర్యజన స్తవనీయమై, భక్తజనపాలనకు గణనీయమై, సుగుణాలకు అలవాలమై, నగరముల కెల్ల తికాయమానమై అలరారుతున్నది.
సృష్ఠ్యాదిలో  బ్రహ్మ మానసపుత్రులై జనించిన మహాత్ములు సనకాదులు. వారు సనకుడు, సనందనుడు, సనత్కుమార, సనత్సుజాతుడు అనే నలుగురు. వారు ఒకమారు శ్రీమన్నారాయణుని దర్శించుకోడానికి వైకుంఠపురం వెళ్ళారు. అక్కడి ద్వారపాలకులు జయ విజయులు అడ్డగించారు. వారిని దేవర్షులు శపించటంతో వారు మూడు సార్లు రాక్షస జన్మలు పొందారు. ఆ వైకుంఠపురం ఎలాంటిదంటే:
(క) వైకుంఠ పురం మిక్కిలి అందమైనది, దివ్యమైన వైభవాలతో అలరారుతుంటుంది, (చ) సర్వకాల సర్వాస్థల యందు శోభిస్తు ఉంటుంది. శాశ్వతంగా  విరాజిల్లుతుంటుంది.
(ట) దాని పేరును శరణాగత భక్తి పొందిన వారు స్మరిస్తు కీర్తిస్తు ఉంటారు.
(త) వైకుంఠ ప్రవేశంతోనే పునర్జలనుండి ముక్తి లభిస్తుంది.
(ప) సజ్జనులు అయిన వారు వైకుంఠధామాన్ని పొగడుతారు.
(గ) భక్తులందరిని కాపాడుట అనే  లక్షణాలకి అలవాలం ఆ వైకుంఠనగరం
(జ) ఆ మహాపుణ్య ధామము నగరాలన్నిటి లోకి సర్వశ్రేష్ఠమైనది.

3-504-cha.
chanichani kaaMchi raMta budhasattamu laMchita nitya divya SO
bhana vibhavaabhiraamamu@M brapanna jana stavaneeya naamamun
janana viraamamun sujana sannuta bhoomamu bhaktalOka paa
lanaguNa dhaamamuMburalalaamamu@MjaaruvikuMThadhaamamamun

          చనిచని = వెళ్ళివెళ్లి; కాంచిరి = దర్శించిరి; అంతన్ = అంతట; బుంధ = ఙ్ఞానులలో; సత్తములు = శ్రేష్టులు; అంచిత = పూజనీయమును; నిత్య = శాశ్వతమును; దివ్య = దివ్యమును; శోభన = ప్రకాశించుచున్నదియు నైన; విభవ = వైభవముతో; అభిరామమున్ = ఒప్పుతున్నదియును; ప్రపన్న = శరాణాగతులకు; స్తవనీయ = స్తుతింపదగిన; నామమున్ = పేరు పొందినది; జనన = పునర్జన్మల వలయాన్ని; విరామమున్ = ఛేదించునదియును; సు = మంచి; జన = జనులచే; సన్నుతన్ = స్తుతింపబడిన; భూమము = పదమును, స్థలమును; భక్త = భక్తులు; లోక = అందరను; పాలన = పరిపాలించు; గుణ = గుణములు కల; ధామమున్ = ప్రదేశమును; పుర = నగరములలో; లలామమున్ = శ్రేష్టమైనదియును అయిన; చారు = అందమైన; వికుంఠ = వైకుంఠ; ధామమున్ = పురమును.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: