Thursday, December 26, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 152

biDDa@MDu

1-261-క.
బిడ్డఁడు మ్రొక్కినఁ దల్లులు
డ్డన నంకముల నునిచి న్నుల తుదిఁబా
లొడ్డగిలఁ బ్రేమభరమున
డ్డువడం దడిపి రక్షిలముల ననఘా!
          శ్రీకృష్ణుడు చాలా రోజుల తరువాత ద్వారకకు తిరిగి వచ్చి నమస్కరించగా అతని తల్లులు అందరు బిడ్డడిమీది బద్దానురాగంతో చటుక్కున తమ తొడలపై కూర్చుండ బెట్టుకున్నారు. ఆపేక్షతో పొంగిపొర్లి చన్నులు చేపుతుండగా, తమ కన్నీటితో అతనిని అభిషేకించారు.
శ్రీకృష్ణుని తల్లులు
వసుదేవుని భార్యలు పద్నాలుగురు 1పౌరవి 2రోహిణి 3మధిర 4కౌసల్య 5రోచన 6ఇళ 7ధృతదేవి 8 శాంతిదేవి 9ఉపదేవి 10దేవరక్షిత 11శ్రీదేవి 12వైశాఖి 13సహదేవి 14దేవకీదేవి.
నందుని భార్య -  1యశోదాదేవి
 
1-261-ka.
biDDa@MDu mrokkina@M dallulu
jaDDana naMkamula nunichi channula tudi@Mbaa
loDDagila@M braemabharamuna
jaDDuvaDaM daDipi rakshijalamula nanaghaa!

          బిడ్డఁడు = కుమారుడు; మ్రొక్కినన్ = నమస్కరింపగ; తల్లులు = తల్లులు; జడ్డనన్ = తటాలున; అంకములన్ = తొడలపై; ఉనిచి = ఉంచుకొని; చన్నుల = చన్నుల; తుదిన్ = మొనలలో; పాలు = క్షీరము; ఒడ్డగిలన్ = పొంగి రాగా; ప్రేమ = ప్రేమ యొక్క; భరమునన్ = భారము వలన; జడ్డువడన్ = ఆశ్చర్యకరముగ; తడిపిరి = చెమ్మగిల చేసిరి; అక్షిజలములన్ = కన్నీటితో; అనఘా = పాపము లేని వాడా.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: