teepugala
10.1-458-క.
తీపుగల కజ్జ మన్యుఁడు
కోపింపఁగ నొడిసి పుచ్చుకొని త్రోపాడం
బైపడి యది గొని యొక్కఁడు
క్రేపులలో నిట్టునట్టుఁ గికురించు నృపా!
ఓ పరీక్షిన్మహారాజా! తియ్యటి పిండివంట ఒకడి చేతిలోంచి మరొకడు
లాక్కుని పారిపోతున్నాడు. మొదటి వాడు ఉడుక్కున్నాడు. ఇంతలో ఇంకొకడు దానిని
లాక్కుని పోయి, దూడల మధ్య అటు యిటు పరిగెడుతు ఏడిపించసాగాడు.
సహజ కవి పోతనల
వారు కళ్ళకుగట్టినట్లు వర్ణించటంలో దిట్ట. మిక్కలి ప్రసిద్ధమైన ఈ పద్యం శ్రీకృష్ణుడు
గోపబాలురతో చల్దులుగుడుచుట అనే ఘట్టంలోది.
10.1-458-ka.
teepugala
kajja manyu@MDu
kOpiMpa@Mga
noDisi puchchukoni trOpaaDaM
baipaDi yadi
goni yokka@MDu
kraepulalO
niTTunaTTu@M gikuriMchu nRpaa!
తీపు = తియ్యదనము; కల = ఉన్న; కజ్జమున్ = భక్ష్యమును; అన్యుడు = ఇంకొకడు; కోపింపన్ = కోపపడునట్లుగా; ఒడిసి = లాగి; పుచ్చుకొని = తీసుకొని; త్రోపాడన్ = తోయగా; పైపడి = మీదపడి; అది = దానిని; కొని = తీసుకొని; ఒక్కడు = ఒకానొకడు; క్రేపుల = ఆవుదూడల; లోన్ = మధ్యలో; ఇట్టునట్టు = ఇటునటు; కికురించున్ = తప్పించుకొంటుతిరుగును; నృపా = రాజా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment