jOjO
10.1-190-క.
జోజో కమలదళేక్షణ!
జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా!
జోజో పల్లవకరపద!
జోజో పూర్ణేందువదన! జోజో యనుచున్.
గోపికలు చిన్నికృష్ణునికి
శుభ్రంగా స్నానం చేయించి, నిద్రపుచ్చుతు – జోజో కమలదళేక్షణ! జోజో మృగరాజమధ్య! జోజో
కృష్ణా! జోజో పల్లవకరపద! జోజో పూర్ణేందువదన! జోజో అంటు జోలపాటలు
పాడారు.
కమలదళేక్షణ అంటే కలువల వంటి కన్నులు కలవాడ. మృగరాజమధ్య అంటే సింహం వంటి
నడుమ కలవాడ. పల్లవకరపద అంటే చెట్టు చిగురుల వలె సున్నిత మైన కాళ్ళు చేతులు కలవాడ.
పూర్ణేందు వదన అంటే నిండు చంద్రుని వంటి మోము కలవాడ. జోజో అంటే సుఖంగా నిద్రపో అని.
10.1-190-ka.
.jOjO
kamaladaLaekshaNa!
jOjO
mRgaraajamadhya! jOjO kRshNaa!
jOjO
pallavakarapada!
jOjO
poorNaeMduvadana! jOjO yanuchun.
జోజో = సుఖంగా బజ్జో నాయనా బజ్జో; కమల = కలువ; దళ = రేకులవంటి; ఈక్షణ = కన్నులు కల వాడా; జోజో = సుఖంగా బజ్జో నాయనా బజ్జో; మృగరాజ = సింహము వంటి; మధ్య = నడుము కల వాడా; జోజో = సుఖంగా బజ్జో నాయనా బజ్జో; కృష్ణా = నల్లనయ్యా; జోజో = సుఖంగా బజ్జో నాయనా బజ్జో; పల్లవ = చిగురు టాకుల వంటి; కర = చేతులు; పద = పాదములు కల వాడా; జోజో = సుఖంగా బజ్జో నాయనా బజ్జో; పూర్ణ = నిండు; ఇందు = చంద్రుని వంటి; వదన = మోము కల వాడా; జోజో = సుఖంగా బజ్జో నాయనా బజ్జో; అనుచున్ = అనుచు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment