Sunday, December 22, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 148

soorijana

3-15-తే.
సూరిజనగేయ మగు రాజసూయ యజ్ఞ
విలస దవభృథస్నాన పవిత్రమైన
ద్రౌపదీ చారు వేణీభరంబు పట్టి
కొలువులోపల నీడ్చిరి కుత్సితమున.

          పండితవరేణ్యుల ప్రశంసలు అందుకొనెడి రాజసూయ యాగంలో పుణ్యవంత మైన అవపృథస్నానంతో పరమ పవిత్రమై ఒప్పారుతున్న ద్రుపదమహారాజు పుత్రిక పాంచాలి కొప్పు పట్టుకొని పరమ నీచంగా నిండు సభలోకి ఈడ్చుకొచ్చారు.
శుక మహర్షి పరీక్షిత్తుకి కురుపాండవుల నడవడులు చెప్పనారంభిస్తూ దుర్యోధునాదుల దౌష్ఠ్యం సూచిస్తున్న సందర్భంలోది ఈ పద్యం.

3-15-tae.
soorijanagaeya magu raajasooya yaj~na
vilasa davabhRthasnaana pavitramaina
draupadee chaaru vaeNeebharaMbu paTTi
koluvulOpala neeDchiri kutsitamuna.

           సూరి = పండితుల; జన = సమూహముచే; గేయము = స్తుతింప దగినది; అగు = అయిన; రాజసూయ = రాజసూయము అను; యజ్ఞ = యజ్ఞము వలన; విలసత్ = విశేష మైన; అవభృథ = యజ్ఞానంతప పుణ్యదీక్షా; స్నాన = స్నానముచే; పవిత్రము = పావనము చేయబడినది; ఐన = అయినట్టి; ద్రౌపదీ = ద్రౌపది యొక్క {ద్రౌపది - ద్రుపద రాకుమారి}; చారు = అందమైన; వేణీ = కురుల; భరమున్ = ముడిని; పట్టి = పట్టుకొని; కొలువు = సభ; లోపలన = లోనికి; ఈడ్చిరి = లాక్కొచ్చిరి; కుత్సితమున = నీచబుద్దితో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: