gaganamu
2-108-క.
గగనము దన కడపలఁ దాఁ
దగ నెఱుగని కరణి విభుఁడు దా నెఱుఁగఁ డనన్
గగనప్రసవము లే దన
నగునే సర్వజ్ఞతకును హాని దలంపన్.
బ్రహ్మదేవుడు నారదునికి భగవత్తత్వం ఉపదేశించే సందర్భంలో
ఇలా చెప్తున్నాడు. భగవంతుడు సర్వజ్ఞడు కనుక తన పరిధి, వ్యాప్తుల పరిమితులు తెలియవు
అనడంలో అసంభవం ఏమి లేదు.
ఆకాశం తన
సరిహద్దులను తెలుసుకోలేదు. అదే విధంగా భగవంతుడు తన సమగ్రతను తానే ఎరుగలేడు. సరిహద్దుల
నెరుగదు అన్నంత మాత్రాన ఆకాశ సర్వ వ్యాప్తిత్వాన్ని
కాదన లేము కదా. అలాగే తన అంతు తనకే తెలియదు అన్నంత మాత్రాన భగవంతుని సర్వజ్ఞతానికి
లోటు వాటిల్లదు.
2-108-ka
gaganamu dana
kaDapala@M daa@M
daga neRugani
karaNi vibhu@MDu daa neRu@Mga@M Danan
gagana prasavamu
lae dana
nagunae
sarvaj~natakunu haani dalaMpan.
గగనము = ఆకాశము; తన = తన యొక్క; కడపలన్ = చివరలను; తాన్ = తాను; తగన్ = తగినట్లు; ఎఱుఁగని = తెలియని; కరణిన్ = విధముగ; విభుఁడు = భగవంతుడు {విభుడు - ప్రభువు}; తాన్ = తనుతాను; ఎఱుఁగన్ = తెలిసికొన లేడు; అనన్ = అనుట వలన; గగన = ఆకాశము; ప్రసవము = ప్రసృతి, వ్యాప్తి; లేదు = లేదు; అనన్ = అన్నట్లుగ; అగునే = వీలగునా ఏమి; సర్వజ్ఞతకున్ = సర్వజ్ఞత్వమునకు; హాని = నష్టము; తలంపన్ = ఆలోచించినట్లైతే.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment