buddhimaMtu@M
9-386-ఆ.
బుద్ధిమంతుఁ డయిన బుధుఁడు పుత్రుండైన
మేను పెంచి రాజు మిన్నుముట్టె;
బుద్ధిగల సుతుండు పుట్టినచోఁ దండ్రి
మిన్నుముట్టకేల మిన్నకుండు?
బుద్ధిమంతుడైన కొడుకు పుడితే తండ్రి
సంతోషంతో ఎంతో ఉప్పొంగిపోతాడు. అన్ని విధాల బుద్ధిమంతుడైన బుధుడు తన కొడుకని
వృద్ధిచెంది చంద్రుడు ఆకాశాన్ని అందుకున్నాడుట.
తారకి చంద్రుని వలన పుట్టిన వాడు బుధుడు. కవి మిన్నుముట్టు
అనే జాతీయాన్ని, సంతోషంతో ఉప్పొంగుట అని, మిన్ను అంటే ఆకాశం ముట్టు అంటే అందుకోడం
అనే అర్థాలని, బుధుడు అంటే బుద్ధిమంతుడు అనే అర్థాన్ని చమత్కారంగా ప్రయోగించిన చక్కటి
నడక గల పద్యం ఇది.
రెండు లేక అంతకన్నా ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు తిరిగి
తిరిగి వస్తు అర్థభేదం కలిగి ఉంటే అది యమకాలంకారం. ఇక్కడ ఉన్నది
మిన్నుముట్ట యమకం అందం.
9-386-aa.
buddhimaMtu@M Dayina budhu@MDu putruMDaina
maenu peMchi
raaju minnumuTTe;
buddhigala
sutuMDu puTTinachO@M daMDri
minnumuTTakaela
minnakuMDu?
బుద్దిమంతుడు = బుద్దిమంతుడు; అయిన = ఐనట్టి; బుధుడు = బుధుడు; పుత్రుండు = కొడుకు; ఐనన్ = కాగా; మేను = శరీరము; పెంచి = పెంచుకొని; రాజు = చంద్రుడు; మిన్నుముట్టెన్ = ఆకాశాన్నందుకొన్నాడు; బుద్ది = వివేకము; కల = కలిగిన; సుతుండు = పుత్రుడు; పుట్టినచోన్ = కలిగిన యెడల; తండ్రి = తండ్రి; మిన్నుముట్టక = గర్వించకుండ; ఏలన్ = ఎందుకు; మిన్నకుండు = ఊరకుండును.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~