Monday, September 30, 2013

తెలుగు భాగవత తేనె సోనలు - 71

balavaMtu@MDa

7-262-క.
వంతుఁడ నే జగముల
ములతోఁ జనక వీరభావమున మహా
లుల జయించితి; నెవ్వని
మున నాడెదవు నాకుఁ బ్రతివీరుఁడ వై.
7-262-ka.
balavaMtu@MDa nae jagamula
balamulatO@M janaka veerabhaavamuna mahaa
balula jayiMchiti; nevvani
balamuna naaDedavu naaku@M brativeeru@MDa vai.
          హిరణ్యాక్షుడు ప్రహ్లాదుడిని ధిక్కరించి ప్రశ్నిస్తున్నాడు ­– బాలకా! లోకా లన్నిటిలో నేనే అందరి కన్నా బలవంతుణ్ణి. సేనా సహాయం ఏం లేకుండానే ఒంటరిగా వెళ్ళి ఎందరో బలశాలుల్ని గెలిచిన శూరుణ్ణి. అలాంటి నాకు సాటి రాగల వీరుడిలా, ఎవరి అండ చూసుకొని, ఎదురు తిరుగుతున్నావు.
          బలవంతుడ = శక్తిశాలిని; నేన్ = నేను; జగములన్ = లోకములలో; బలముల = సైన్యముల; తోన్ = తోటి; చనక = వెళ్ళక; వీరభావమునన్ = శూరత్వముతో; మహా = మిగుల; బలులన్ = బలవంతులను; జయించితిన్ = నెగ్గితిని; ఎవ్వని = ఎవని; బలమునన్ = దన్నుతో; ఆడెదవు = పలికెదవు; నా = నా; కున్ = కు; ప్రతివీరుడవు = ఎదిరించెడి శూరుడవు; = వలె.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Sunday, September 29, 2013

తెలుగు భాగవత తేనె సోనలు - 70

anupama guNa haaraa

1-529-మా.
నుపమగుణహారా! న్యమా నారివీరా!
వినుతవిహారా! జానకీ చిత్త చోరా!
నుజ ఘన సమీరా! దానవశ్రీ విదారా!
కలుష కఠోరా! కంది గర్వాపహారా!
            1-529-maa.
anupamaguNahaaraa! hanyamaa naariveeraa!
jana vinutavihaaraa! jaanakee chitta chOraa!
danuja ghana sameeraa! daanavaSree vidaaraa!
ghana kalusha kaThOraa! kaMdi garvaapahaaraa!  
          సాటిలేని కల్యాణ గుణ హారుడా! పరాజిత వైరులే గల వీరుడా! సర్వ లోకాలకు స్తుతింప తగ్గ విహారాలు గల మహాత్మా! సీతా మానస చోరుడా! శత్రువులనే మేఘాల పాలిటి సమీర మైన వాడా! రాక్షసుల వైభవాలు విదళించే వాడా! కరడు గట్టిన కలుషాత్ముల పాలిటి అతి కఠినుడా! సముద్రుని సమస్త గర్వాన్ని హరించిన వాడా! దయతో చిత్తగించుము.
          అనుపమ = సాటి లేని; గుణ = గుణములు అను; హారా = హారము కల వాడా; హన్యమాన = చంపబడిన; అరివీరా = శత్రువీరులు కల వాడా; జన = జనుల చేత; వినుత = స్తుతింప తగిన; విహారా = విహరాలు కల వాడా; జానకీ = జానకి యొక్క; చిత్త = మనస్సును; చోరా = దొంగిలించిన వాడా; దనుజ = రాక్షసులు అను; ఘన = మేఘములకు; సమీరా = వాయువు వంటి వాడా; దానవ = దానవుల; శ్రీ = ని; విదారా = విదళించు వాడా, బ్రద్దలు కొట్టు వాడా; ఘన = అత్యధిక, కరడు గట్టిన; కలుష = పాపుల ఎడ; కఠోరా = కఠోరముగా ఉండు వాడా; కంది = సముద్రుని; గర్వ = గర్వమును; అపహారా = తొలగించిన వాడా.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Saturday, September 28, 2013

VAK లో వార్త

           చిలుకూరు - విఎకె సెప్టెంబరు 13 పత్రికలో తెలుగుభాగవతం.ఆర్గ్ ఆవిష్కరణ వార్త ప్రకటించారు. ఈ సందర్భంలో తన సన్నిధానంలో ఆవిష్కరణ చేయింప జేసిన బాలాజీకి భక్తి పూర్వక సాష్టాంగ దండ ప్రణామాలు. ఆశీర్వదించి ఆవిష్కరించిన సౌందర రాజన్, రంగ రాజన్ గార్లకు కృతఙ్ఞతా పూర్వక పాదాభివందనాలు. ఆ కార్యక్రమ వార్త ప్రచురించిన విఎకె వారికి ధన్యవాదాలు. ఆవిష్కరణ ఆలోచన చేసిన బండి శ్రీనివాస శర్మకి స్నేహార్ద్ర పూర్వక ధన్యవాదాలు. వ్యక్తిగతంగా వచ్చి జయప్రదం జేసిన బంధు మిత్రుల కు ధన్యవాదములు.  స్పందించి ప్రోత్సహించిన బంధుమిత్రులకు ధన్యవాద ములు. ఈ విధంగా విఎకె, పూజారుల, బాలాజీ వార్ల ద్వారా మరింత పవిత్రత్వం సంతరించుకొన్న మన తెలుగుభాగవతం.ఆర్గ్ మరింత మెరుగు కావాలని మరింత మందికి చేరాలని ఆశీర్వదించండి అని ప్రార్థిస్తూ.  .  .  .  . (ఊలపల్లి సాంబశివ రావు), గణనాధ్యాయి,

తెలుగు భాగవత తేనె సోనలు - 69

te~rava yokate


10.1-324-క.
తెవ యొకతె నిద్రింపఁగ
నెఱిఁ గట్టిన వలువ వీడ్చి నే టగు తేలుం
పించి నీ కుమారుఁడు
వెచుచు నది పఱవ నగియె విహితమె? సాధ్వీ!
10.1-324-ka.
te~rava yokate nidriMpa@Mga
ne~ri@M gaTTina valuva veeDchi nae Tagu taeluM
ga~rapiMchi nee kumaaru@MDu
ve~rachuchu nadi pa~rava nagiye vihitame? saadhvee!
        గోపికలు బాలకృష్ణుని అల్లరి ముచ్చట్లు యశోదకు చెప్తున్నారు – ఒకామె నిద్రపోతుంటే బట్టలు విప్పేసి, నీ కొడుకు ఇంత పెద్ద తేలు తెచ్చి కరిపించాడు. ఆమె బెదిరిపోయి పెద్ద నోరెట్టుకొని అరుస్తూ గంతులు వేస్తుంటే మీ అబ్బాయి పకపక నవ్వాడు. ఇదేమైనా బాగుందా తల్లీ! ఎంతో సాధు స్వభావివి కదా నువ్వు చెప్పు మరి.
           తెఱవ = ఇంతి {తెఱవ = తెఱ+వా (తెలివైన, నిండైన నోరు కలామె), స్త్రీ}; ఒకతె = ఒకర్తె; నిద్రింపగన్ = నిద్రపోతుంటే; నెఱిన్ = చక్కగా; కట్టిన = కట్టుకొన్న; వలువన్ = చీరను; వీడ్చి = విప్పి; నేటు = దృఢమైనది; అగు = ఐన; తేలున్ = తేలుచేత; కఱిపించి = కరిపించి; నీ = నీ యొక్క; కుమారుడు = పిల్లవాడు; వెఱచుచున్ = బెదిరిపోతూ; అది = ఆమె; పఱవన్ = పరుగెడు తుంటే; నగియెన్ = నవ్వెను; విహితమె = తెలియునా; సాధ్వీ = అబల {సాధ్వి = సాధు స్వభావము కలామె, స్త్రీ}.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Friday, September 27, 2013

తెలుగు భాగవత తేనె సోనలు - 68



vaari@M gOruchunna

1-463-ఆ.
వారిఁ గోరుచున్న వారికి శీతల
వారి యిడుట యెట్టి వారి కయిన
వారితంబు గాని లసిన ధర్మంబు
వారి యిడఁడు దాహవారి గాఁడు.
1-463-aa.
vaari@M gOruchunna vaariki Seetala
vaari yiDuTa yetti vaari kayina
vaaritaMbu gaani valasina dharmaMbu
vaari yiDa@MDu daahavaari gaa@MDu.
          దాహంతో అల్లాడిపోతూ పరీక్షిత్తు నీ ళ్ళడిగితే ధ్యానంలో ఉన్న శమీకమహర్షి స్పందించ లేదు. అది గమనించక ఉక్రోషంతో పరీక్షిన్మహారాజు మరోలా అనుకుం టున్నాడు – దాహంతో నోరెండి పోయి వాకిట్లోకి వచ్చి మంచినీళ్ళు అడిగిన అతిథికి, చల్లని మంచినీళ్ళు ఇవ్వటం ఎటువంటి వారికి అయినా సరే కాదనరాని కనీస కర్తవ్యమే. కాని ఇతడు మంచినీళ్ళు ఇవ్వటంలేదు, దాహం తీర్చటం లేదు.
వారిన్ = నీరు; కోరుచు = అడుగుచు; ఉన్న = ఉన్న; వారు = వారు; కిన్ = కి; శీతల = చల్లని; వారి = నీరు; ఇడుట = ఇచ్చుట; ఎట్టి = ఎటువంటి; వారు = వారు; కిన్ = కి; అయినన్ = అయినను; వారితంబు = నివారింప బడుటకు - తప్పించుకొన; కాని = కాని - లేని; వలసిన = ముఖ్యమైన; ధర్మంబు = ధర్మము; వారి = నీరు; ఇడఁడు = ఇవ్వడు; దాహ = దాహమును; వారి = వారించువాడు; కాఁడు = కాడు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Thursday, September 26, 2013

తెలుగు భాగవత తేనె సోనలు - 67

chaMDa dOrdaMDaleela

4-505-తే.
చండ దోర్దండలీల భూమండలంబు
సమతలంబుగఁ జేసి శశ్వత్ప్రసిద్ధి
నొంది య వ్విభుఁ డీ లోకమందు నెల్ల
ప్రజకుఁ దండ్రియు జీవనప్రదుఁడు నగుచు.
4-505-tae.
chaMDa dOrdaMDaleela bhoomaMDalaMbu
samatalaMbuga@M jaesi SaSvatprasiddhi
noMdi ya vvibhu@M Dee lOkamaMdu nella
prajaku@M daMDriyu jeevanapradu@MDu naguchu.
          పృథుచక్రవర్తి తన భుజబలంతో నే లంతా సమతలంగా చేసాడు. ఆ ప్రభువు తండ్రి యై ప్రజలకు బ్రతుకు తెరువు కల్పించాడు, శాశ్వత మైన యశస్సు గడించాడు.
           చండ = భయంకర మైన; దోర్దండ = భుజముల; లీలన్ = విలాసములతో; భూ మండలంబున్ = నేల అంతటిని; సమ తలంబున్ = ఎగుడు దిగుడు లేని ప్రదేశముగ; చేసి = చేసి; శశ్వత్ = శాశ్వత మైన; ప్రసిద్ధిన్ = కీర్తిని; ఒందెన్ = పొందెను; = ; విభుడు = ప్రభువు; = ; లోకము = జగము; అందున్ = లో యున్న; ఎల్ల = అందరు; ప్రజ = జనుల; కున్ = కు; తండ్రియు = తండ్రి; జీవన = జీవికను, జీవనోపాధిని; ప్రదుడున్ = సమకూర్చు వాడు; అగుచున్ = అవుతూ
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~