7-97-కంద పద్యము
కృశలై సంప్రాపిత
దు
ర్దశలై సర్వంకషోగ్ర
దైతేయాజ్ఞా
వశలై నిశలును
దివములు
దిశ లెల్లను గట్టుబడియె దీనత ననఘా!
హిరణ్యకశిపుని
దాడితో, ఓ పుణ్యాత్ముడైన ధర్మరాజా! దిక్కులన్నీ రాత్రింబవళ్ళు
కృంశించి, ఎల్లెడలా రాక్షసుల ధిక్కారాలకు లోనౌతూ ఎంతో దీనావస్థలను పొందుతూ ఉన్నాయి.
७-९७-कंद पद्यमु
कृशलै संप्रापित दु
र्दशलै सर्वंकषोग्र दैतेयाज्ञा
वशलै निशलुनु दिवमुलु
दिश लेल्लनु गट्टुबडिये दीनत ननघा!
కృశలు
= కృశించినవి; ఐ = అయ్యి; సంప్రాపిత = పొందింపబడిన; దుర్దశలు = హీనమైన స్థితులనుగలవి; ఐ = అయ్యి; సర్వ = అందరిని; అంకష = వత్తడిచేయుచున్న; ఉగ్ర = భయంకరమైన; దైతేయ = రాక్షసుని; ఆజ్ఞా = ఉత్తరములకు; వశలు = లోనైనవి; ఐ = అయ్యి; నిశలున్ = రాత్రులు; దివముల్ = పగళ్ళు; దిశలు = దిక్కులు; ఎల్లను = సమస్తమును; కట్టుబడియెన్ = కట్టుబడిపోయెను; దీనతన్ = జాలికిలోనై; అనఘా = పుణ్యుడా.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment