Saturday, June 6, 2015

నారాయణుని వైషమ్య అభావం - నీ సంప్రశ్నము


7-4-వచనము
అనిన శుకుం డిట్లనియె.
          ఇలా అడిగిన పరీక్షిత్తునితో శుకబ్రహ్మ ఇలా అన్నాడు
       అనినన్ = అని పలుకగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
7-5-శార్దూల విక్రీడితము
నీ సంప్రశ్నము వర్ణనీయము గదా నిక్కంబు రాజేంద్ర! ల
క్ష్మీసంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింపఁ ద
ద్దాసాఖ్యానము లొప్పు విష్ణుచరణధ్యానప్రధానంబు లై
శ్రీసంధానములై మునీశ్వరవచోజేగీయమానంబు లై.
          “ఓ పరీక్షిత్తు మహారాజా! నువ్వు నిజంగా చాలా చక్కటి ప్రశ్న అడిగావు. లక్ష్మీదేవి చేత కూడా సేవించబడే ఆ శ్రీ మహావిష్ణువు కథలు చాలా ఆశ్చర్యకరంగానే ఉంటాయి. విచారించి చూస్తే ఆయన భక్తుల కథలు కూడా అలాంటివే. అవి విష్ణు పాద భక్తి ప్రపత్తులను కలిగించేవి; శ్రేయస్కరము లైనవి; మహా మునుల చేత కీర్తింపబడేవి;
7-5-shaardoola vikreeDitamu
nee saMprashnamu varNaneeyamu gadaa nikkaMbu raajEMdra! la
kShmeesaMbhaavyuni sachcharitramu mahaachitraMbu chiMtiMpaM~ da
ddaasaakhyaanamu loppu viShNucharaNadhyaanapradhaanaMbu lai
shreesaMdhaanamulai muneeshvaravachOjEgeeyamaanaMbu lai.
            నీ = నీ యొక్క; సంప్రశ్నము = చక్కటి యడుగుట; వర్ణనీయము = మెచ్చుకోదగినది; కదా = కదా; నిక్కంబు = నిజమే; రాజ = రాజులలో; ఇంద్ర = ఉత్తముడ; లక్ష్మీసంభావ్యుని = నారాయణుని {లక్ష్మీసంభావ్యుడు - లక్ష్మీ దేవి చేత సంభావ్యుడు (సేవింపదగినవాడు), విష్ణువు}; సత్ = చక్కటి; చరిత్రము = వర్తనము; మహా = మిక్కలి; చిత్రంబు = అద్భుతమైనది; చింతింపన్ = తరచిచూసిన; తత్ = అతని; దాస = భక్తుల; ఆఖ్యానములు = కథలు; ఒప్పున్ = చక్కగకలిగి యుండును; విష్ణు = నారాయణుని; చరణ = పాదముల; ధ్యాన = చింతనములే; ప్రధానంబులు = ముఖ్యాంశములుగగలవి; ఐ = అయ్యి; శ్రీ = శుభములను; సంధానములు = కూర్చునవి; ఐ = అయ్యి; ముని = మునులలో; ఈశ్వర = అత్యుత్తముల; వచస్ = పలుకులచే; జేగీయమానంబులు = స్తుతింపబడెడివి; ఐ = అయ్యి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Friday, June 5, 2015

నారాయణుని వైషమ్య అభావం - సర్వభూతములకు

7-3-సీస పద్యము
సర్వభూతములకు సముఁడు నెచ్చలి ప్రియుం; డైన వైకుంఠుఁ డనంతుఁ డాద్యుఁ
డింద్రునికొఱకు దైత్యేంద్రుల నేటికి; విషముని కైవడి వెదకి చంపె?
నసురులఁ జంపంగ నమరులచేఁ దన,;  కయ్యెడి లాభ మింతైనఁ గలదె?
నిర్వాణనాథుండు నిర్గుణుం డగు తన,; కసురుల వలని భయంబుఁ బగయుఁ
7-3.1-ఆటవెలది
గలుగనేర వట్టి ఘనుఁడు దైత్యులఁ జంపి
సురులఁ గాచు చునికి చోద్య మనుచు
సంశయంబు నాకు జనియించె మునినాథ!
ప్రజ్ఞమెఱసి తెలియఁ బలుకవయ్య!
         “ఓ మునీశ్వరా! శుక మహర్షి! విష్ణుమూర్తి జీవులు అన్నిటి అందు సమానుడు, మిత్రుడు, బంధువు కదా. అలాంటప్పుడు, విష్ణువు ఇంద్రుడి కోసం రాక్షసులను అందరిని మోసగాడిలా ఎందుకు వెతికి మరీ చంపాడు? రాక్షసులను చంపి, దేవతలను కాపాడితే తనకి ఏమిటి లాభం? జీవులందరికి ముక్తిని ఇచ్చే విష్ణువుకు రాక్షసుల వలన భయం కాని, విరోధం కాని కలుగుతుందా? లేదు కదా! మరి, మమకారం కల వాడిలా రాక్షసులను చంపటం, దేవతలను రక్షించటం అది చూస్తుంటే చిత్రంగా ఉంది. దీని వలన నాకు సందేహం కలుగుతోంది. నీకు తెలిసినది అంతా నాకు తెలియజెప్పు, తండ్రీ!”
            సర్వ = అఖిల; భూతముల్ = జీవుల; కున్ = కు; సముడు = అంగీకార మైన వాడు; నెఱ = ముఖ్య; చెలి = స్నేహితుడు; ప్రియుండు = ఇష్టుడు; ఐన = అయిన; వైకుంఠుడు = నారాయణుడు {వైకుంఠుడు – వైకుంఠమున నుండు వాడు, విష్ణువు}; అనంతుడు = నారాయణుడు {అనంతుడు - అంతము లేని వాడు, విష్ణువు}; ఆద్యుడు = నారాయణుడు {ఆద్యుడు - సృష్టి ఆది నుండి ఉన్న వాడు, విష్ణువు}; ఇంద్రుని = దేవేంద్రుని; కొఱకున్ = కోసము; దైత్య = రాక్షసుల {దైత్యులు - దితి యొక్క పుత్రులు}; ఇంద్రులన్ = నాయకులను; ఏటికి = ఎందులకు; విషముని = శత్రుని {విషముని – రాగద్వేషాది గుణములచే విషమమైన బుద్ధి కల వాడు}; కైవడి = వలె; వెదకి = వెతికి; చంపెన్ = సంహరించెను; అసురులన్ = రాక్షసులను {అసురులు - సురులు (దేవతలు) కానివారు, రాక్షసులు}; చంపగన్ = చంపుటవలన; అమరుల్ = దేవతలు {అమరులు – మరణము లేని వారు, దేవతలు}; చేన్ = వలన; తన = తన; కున్ = కు; అయ్యెడి = కలిగెడి; లాభము = ప్రయోజనము; ఇంత = కొంచెము; ఐన = అయినను; కలదె = ఉన్నదా ఏమి, లేదు; నిర్వాణ = మోక్షమునకు; నాథుండు = ప్రభువు; నిర్గుణుండు = గుణరహితుడు; అగు = అయినట్టి; తన = తన; కిన్ = కి; అసురుల = రాక్షసుల; వలని = మూలమున; భయంబున్ = భయముకాని; పగయున్ = పగ కాని; కలుగన్ = కలుగుటలు; నేరవు = సమర్థములు గావు; అట్టి = అటువంటి.
            ఘనుడు = గొప్పవాడు; దైత్యులన్ = రాక్షసులను; చంపి = సంహరించి; సురులన్ = దేవతలను; కాచుచుని = కాపాడుట; కిన్ = కు; చోద్యము = ఆశ్చర్యకరము; అనుచున్ = అని; సంశయంబు = అనుమానము; నా = నా; కున్ = కు; జనియించెన్ = కలిగెను; ముని = మునియైనట్టి; నాథ = ప్రభువ; ప్రజ్ఞ = బుద్ధి; మెఱసి = అతిశయించగ; తెలియన్ = తెలియునట్లు; పలుకవు = చెప్పుము; అయ్య = తండ్రి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Thursday, June 4, 2015

నారాయణుని వైషమ్య అభావం - శ్రీ మద్విఖ్యాతిలతా


7-1-కంద పద్యము
శ్రీ మద్విఖ్యాతిలతా
క్రామితరోదోంతరాళ! కమనీయమహా
జీమూతతులితదేహ
శ్యామలరుచిజాల! రామచంద్రనృపాలా!
          చక్కటి కీర్తిలతలు లోకమంతా వ్యాపించిన వాడా! మనోహరమైన నీలి మేఘఛాయను పోలెడి మేను కలవాడా! శ్రీరామచంద్ర మహారాజా! అవధరించు.
७-२१-वचनमु
अनिन नारदुं डिट्लनिये "नोक्कनाँडु ब्रह्ममानसपुत्रु लैन सनकसनंदनादुलु दैवयॉगंबुन भुवनत्रयंबु नंदुनु संचरिंचुचु नैदार्रॅंड्लप्रायंपु बालकुलभावंबुन दिगंबरु लयि हरिमंदिरंबुनकु वच्चि चोच्चुनेड मोगसाल नुन्न पुरुषु लिरुवुरु वारलं जूचि.
          శ్రీమత్ = సంపద్యుక్తమైన; విఖ్యాతి = కీర్తి అనెడి; లతా = తీగచే; ఆక్రామిత = అల్లుకొనబడిన; రోదస్ = భూమ్యాకాశములు; అంతరాళ = అందలి ప్రదేశములు గల వాడ; కమనీయ = చూడ చక్కని; మహా = గొప్ప; జీమూత = మేఘములతో; తులిత = సరిపోలెడి; దేహ = శరీరపు; శ్యామల = నల్లని; రుచిర = కాంతుల; జాల = సమూహములు గల వాడ; రామచంద్ర = శ్రీరామచంద్ర; నృపాల = మహారాజ.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :