Friday, June 5, 2015

నారాయణుని వైషమ్య అభావం - సర్వభూతములకు

7-3-సీస పద్యము
ర్వభూతములకు ముఁడు నెచ్చలి ప్రియుం; డైన వైకుంఠుఁ డనంతుఁ డాద్యుఁ
డింద్రునికొఱకు దైత్యేంద్రుల నేటికి; విషముని కైవడి వెదకి చంపె?
సురులఁ జంపంగ మరులచేఁ దన,;  య్యెడి లాభ మింతైనఁ గలదె?
నిర్వాణనాథుండు నిర్గుణుం డగు తన,; సురుల వలని భయంబుఁ బగయుఁ
7-3.1-ఆటవెలది
లుగనేర వట్టి నుఁడు దైత్యులఁ జంపి
సురులఁ గాచు చునికి చోద్య మనుచు
సంశయంబు నాకు నియించె మునినాథ!
ప్రజ్ఞమెఱసి తెలియఁ లుకవయ్య!
         “మునీశ్వరా! శుక మహర్షి! విష్ణుమూర్తి జీవులు అన్నిటి అందు సమానుడు, మిత్రుడు, బంధువు కదా. అలాంటప్పుడు, విష్ణువు ఇంద్రుడి కోసం రాక్షసులను అందరిని మోసగాడిలా ఎందుకు వెతికి మరీ చంపాడు? రాక్షసులను చంపి, దేవతలను కాపాడితే తనకి ఏమిటి లాభం? జీవులందరికి ముక్తిని ఇచ్చే విష్ణువుకు రాక్షసుల వలన భయం కాని, విరోధం కాని కలుగుతుందా? లేదు కదా! మరి, మమకారం కల వాడిలా రాక్షసులను చంపటం, దేవతలను రక్షించటం అది చూస్తుంటే చిత్రంగా ఉంది. దీని వలన నాకు సందేహం కలుగుతోంది. నీకు తెలిసినది అంతా నాకు తెలియజెప్పు, తండ్రీ!”
            సర్వ = అఖిల; భూతముల్ = జీవుల; కున్ = కు; సముడు = అంగీకార మైన వాడు; నెఱ = ముఖ్య; చెలి = స్నేహితుడు; ప్రియుండు = ఇష్టుడు; ఐన = అయిన; వైకుంఠుడు = నారాయణుడు {వైకుంఠుడు – వైకుంఠమున నుండు వాడు, విష్ణువు}; అనంతుడు = నారాయణుడు {అనంతుడు - అంతము లేని వాడు, విష్ణువు}; ఆద్యుడు = నారాయణుడు {ఆద్యుడు - సృష్టి ఆది నుండి ఉన్న వాడు, విష్ణువు}; ఇంద్రుని = దేవేంద్రుని; కొఱకున్ = కోసము; దైత్య = రాక్షసుల {దైత్యులు - దితి యొక్క పుత్రులు}; ఇంద్రులన్ = నాయకులను; ఏటికి = ఎందులకు; విషముని = శత్రుని {విషముని – రాగద్వేషాది గుణములచే విషమమైన బుద్ధి కల వాడు}; కైవడి = వలె; వెదకి = వెతికి; చంపెన్ = సంహరించెను; అసురులన్ = రాక్షసులను {అసురులు - సురులు (దేవతలు) కానివారు, రాక్షసులు}; చంపగన్ = చంపుటవలన; అమరుల్ = దేవతలు {అమరులు – మరణము లేని వారు, దేవతలు}; చేన్ = వలన; తన = తన; కున్ = కు; అయ్యెడి = కలిగెడి; లాభము = ప్రయోజనము; ఇంత = కొంచెము; ఐన = అయినను; కలదె = ఉన్నదా ఏమి, లేదు; నిర్వాణ = మోక్షమునకు; నాథుండు = ప్రభువు; నిర్గుణుండు = గుణరహితుడు; అగు = అయినట్టి; తన = తన; కిన్ = కి; అసురుల = రాక్షసుల; వలని = మూలమున; భయంబున్ = భయముకాని; పగయున్ = పగ కాని; కలుగన్ = కలుగుటలు; నేరవు = సమర్థములు గావు; అట్టి = అటువంటి.
            ఘనుడు = గొప్పవాడు; దైత్యులన్ = రాక్షసులను; చంపి = సంహరించి; సురులన్ = దేవతలను; కాచుచుని = కాపాడుట; కిన్ = కు; చోద్యము = ఆశ్చర్యకరము; అనుచున్ = అని; సంశయంబు = అనుమానము; నా = నా; కున్ = కు; జనియించెన్ = కలిగెను; ముని = మునియైనట్టి; నాథ = ప్రభువ; ప్రజ్ఞ = బుద్ధి; మెఱసి = అతిశయించగ; తెలియన్ = తెలియునట్లు; పలుకవు = చెప్పుము; అయ్య = తండ్రి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: