10.2-844-చ.
సమధిక బాహుశౌర్యజితచండవిరోధులు వెళ్లి రున్నత
క్షమ గద భానువింద శుక సాత్యకి సారణ చారుదేష్ణ సాం
బ మకరకేతనాత్మజ శ్వఫల్కతనూభవ తత్సహోదర
ప్రముఖ యదూత్తముల్ విమతభంజనులై కృతవర్మమున్నుగన్
10.2-845-క.
వారణ వాజిస్యందన
వీరభటావలులు సనిరి విశ్వము వడఁకన్
ఘోరాకృతి వివిధాయుధ
భూరిద్యుతు లర్కబింబముం గబళింపన్.
భావము:
మహా భుజబల పరాక్రమవంతులైన గదుడు, భానువిందుడు, శుకుడు, సాత్యకి, సారణుడు, చారుదేష్ణుడు, సాంబుడు, ప్రద్యుమ్నుని నందననుడు అనిరుద్ధుడు, శఫల్కుని పుత్రుడు అక్రూరుడు మున్నగు యాదవవీరులందరూ కృతవర్మ నాయకత్వంతో యుద్ధభూమికి బయలుదేరారు. యాదవవీరులు చతురంగబలసమేతులై జగత్తు కంపిస్తుండగా, తాము ధరించిన రకరకాల ఆయుధాల కాంతులు సూర్యబింబాన్ని కప్పివేస్తుండగా అరివీర భీకరంగా రణరంగానికి బయలుదేరారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=845
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment