39- వ.
అని
పలికి, రుక్మిణీదేవి పెండ్లినక్షత్రంబుఁ
దెలిసి, దన పంపున రథ సారథి యైన దారకుండు సైబ్య సుగ్రీవ
మేఘపుష్ప వలాహకంబు లను తురంగంబులం గట్టి రథమాయత్తంబు చేసి తెచ్చిన నమోఘ మనోరథుండైన
హరి తానును, బ్రాహ్మణుండును రథారోహణంబు జేసి యేకరాత్రంబున
నానర్తక దేశంబులు గడచి, విదర్భదేశంబు నకుఁ జనియె; నందు కుండినపురీశ్వరుండైన భీష్మకుండు కొడుకునకు వశుండై కూఁతు శిశుపాలున
కిత్తునని తలఁచి, శోభనోద్యోగంబులు చేయించె నప్పుడు.
ఇలా చెప్పి, రుక్మిణి పెళ్ళి
ముహుర్తం కృష్ణుడు తెలుసు కొన్నాడు. కృష్ణుని ఉత్తర్వు ప్రకారం రథసారథి యైన
దారకుడు సైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము లనే గుర్రాలు నాలుగింటిని కట్టిన రథం
సిద్దం చేసాడు. వాసుదేవుడు బ్రాహ్మణునితోబాటు రథ మెక్కేడు. ఒక్క రాత్రిలోనే
నానర్తకదేశాలు దాటి కుండినపురం చేరాడు. ఆ సమయములో అక్కడ, కొడుకునకు వశవర్తుడు అయిన
భీష్మకుడు కూతుర్ని చైద్యునికి ఇద్దామనుకుంటు పెళ్ళి ప్రయత్నాలు మొదలెట్టాడు.
39- va.
ani paliki, rukmiNeedEvi peMDlinakShatraMbuM~ delisi, dana paMpuna
ratha saarathi yaina daarakuMDu saibya sugreeva mEghapuShpa valaahakaMbu lanu
turaMgaMbulaM gaTTi rathamaayattaMbu chEsi techchina namOgha manOrathuMDaina
hari taanunu, braahmaNuMDunu rathaarOhaNaMbu jEsi yEkaraatraMbuna naanartaka
dEshaMbulu gaDachi, vidarbhadEshaMbu nakuM~ janiye; naMdu
kuMDinapureeshvaruMDaina bheeShmakuMDu koDukunaku vashuMDai kooM~tu
shishupaaluna kittunani talaM~chi, shObhanOdyOgaMbulu chEyiMche nappuDu.
అని = అని; పలికి = చెప్పి; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి యొక్క; పెండ్లి = వివాహపు; నక్షత్రంబున్ = ముహూర్తమును; తెలిసి = తెలిసికొని; తన = అతని యొక్క; పంపునన్ = ఆజ్ఞ ప్రకారము; రథ = రథమును; సారథి = నడుపువాడు; ఐన = అయిన; దారకుండు = దారకుడు; సైబ్య = సైబ్య; సుగ్రీవ = సుగ్రీవ; మేఘపుష్ప = మేఘపుష్ప; వలాహకంబులు = వలాహకము; అను = అనెడి; తురంగంబులన్ = గుర్రములను; కట్టి = కట్టి; రథమున్ = రథమును; ఆయత్తంబు = సిద్ధము; చేసి = చేసి; తెచ్చినన్ = తీసుకొని రాగా; అమోఘ = తిరుగులేని; మనోరథుండు = సంకల్పం కలవాడు; ఐన = అయిన; హరి = కృష్ణుడు; తానును = అతను; బ్రాహ్మణుండును = విప్రుడు; రథ = రథమును; ఆరోహణంబున్ = ఎక్కుట; చేసి = చేసి; ఏక = ఒకే; రాత్రంబునన్ = రాత్రిలోనే; ఆనర్తకదేశంబులన్ = ఆనర్తకదేశములను; గడచి = దాటి; విదర్భదేశంబున్ = విదర్భ అనెడి దేశము; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అందున్ = అప్పుడు; కుండినపుర = కుండిననగరమునకు; ఈశ్వరుండు = ప్రభువు; ఐన = అయిన; భీష్మకుండు
= భీష్మకుడు; కొడుకున్ = పుత్రుని; కున్
= కి; వశుండు = లొంగినవాడు; ఐ = అయ్యి;
కూతున్ = కుమార్తెను; శిశుపాలున్ = శిశుపాలుడి;
కున్ = కి; ఇత్తున్ = భార్యగా ఇచ్చెదను;
అని = అని; తలచి = ఎంచి; శోభన = శుభకార్య; ఉద్యోగంబులు = ప్రయత్నములు;
చేయించెన్ = చేయించెను; అప్పుడు = ఆ సమయము నందు.
:
: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment