51- ఉ.
చెప్పదు తల్లికిం
దలఁపు చిక్కు; దిశల్ దరహాస చంద్రిక
ల్గప్పదు; వక్త్రతామరసగంధ
సమాగత భృంగసంఘ మున్
రొప్పదు; నిద్ర గైకొన; దురోజపరస్పరసక్త
హారముల్
విప్పదు; కృష్ణమార్గగతవీక్షణపంక్తులు
ద్రిప్ప దెప్పుడున్.
రుక్మిణీ దేవి, ముకుందుని
రాకకై ఆతృతగా ఎదురు చూస్తూ అటునుండి చూపులు తిప్పడం లేదు. తన మనసు లోని వేదనలు
తల్లికి కూడ చెప్పటం లేదు. చిరునవ్వులు చిందించటం లేదు. ముఖపద్మానికి మూగిన
తుమ్మెదలని తోలటం లేదు. వక్షస్థలం మీది గొలుసుల చిక్కులను విడదీయటం లేదు.
51- u.
cheppadu tallikiM dalaM~pu chikku; dishal darahaasa chaMdrika
lgappadu; vaktrataamarasagaMdha samaagata bhRiMgasaMgha mun
roppadu; nidra gaikona; durOjaparasparasakta haaramul
vippadu; kRiShNamaargagataveekShaNapaMktulu drippa deppuDun.
చెప్పదు = తెలుపదు; తల్లి = తల్లి; కిన్ = కి; తలపుచిక్కు = మనసులోనివిచారమును; దిశల్ = దిక్కులందు; దరహాస = చిరునవ్వుల; చంద్రికల్ = వెన్నెలలను; కప్పదు = ఆవరింపజేయదు; వక్త్ర = ముఖము అనెడి; తామరస = పద్మము యొక్క; గంధ = సువాసనచే; సమాగత = చేరిన; భృంగ = తుమ్మెదల; సంఘమున్ = సమూహమును; రొప్పదు = అదిలించదు; నిద్రన్ = నిద్రపోవుట; కైకొనదు = చేయదు; ఉరోజ = వక్షస్థలమునందు; పరస్పర = ఒకదానితోనొకటి; సక్త = చిక్కుకొన్న; హారముల్ = దండలను; విప్పదు = విడదీసుకొనదు; కృష్ణ = కృష్ణుని; మార్గ = వచ్చుదారి యందు; గత = లగ్నమైన; వీక్షణ = చూపుల; పంక్తులున్ = వరుసలను; త్రిప్పెదు = మరలింపదు; ఎప్పుడున్ = క్షణకాలమైన.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment