42- మ.
భటసంఘంబులతో
రథావళులతో భద్రేభ యూధంబుతోఁ
బటువేగాన్విత
ఘోటకవ్రజముతో బంధుప్రియశ్రేణితోఁ
గటుసంరంభముతో
విదర్భతనయం గై కొందు నంచున్ విశం
కటవృత్తిం
జనుదెంచెఁ జైద్యుఁడు గడున్ గర్వించి
యవ్వీటికిన్.
విదర్భ రాకుమారి రుక్మిణిని
పెళ్ళాడతానంటు శిశుపాలుడు ఎంతో గర్వంగా చతురంగ బలాలతో, ఎందరో కాల్బంటులుతో, రథాల
వరుసలుతో, భద్రగజాల సమూహంతో, మిక్కిలి వేగవంతమైన గుర్రాల సైన్యంతో, బందువులతో,
చెలికాళ్ళతో గొప్ప అట్టహాసంగా ఆ కుండిన నగరానికి వచ్చాడు.
42- ma.
bhaTasaMghaMbulatO rathaavaLulatO bhadrEbha yoodhaMbutOM~
baTuvEgaanvita ghOTakavrajamutO baMdhu priya shrENitOM~
gaTusaMraMbhamutO vidarbhatanayaM gai koMdu naMchun vishaM
kaTavRittiM janudeMcheM~ jaidyuM~Du gaDun garviMchi ya vveeTikin.
భటసంఘంబుల్ = పదాతిదళముల; తోన్ = తోటి; రథా = రథముల; ఆవళుల్ = దళముల; తోన్ = తోటి; భద్ర = భద్రజాతి {భద్రము - శుభకార్యములందు పురప్రచార యోగ్యమైనది ఈ జాతి
ఏనుగు}; ఇభ = గజ {త్రివిధ
గజ జాతులు - 1భద్రము 2మందము 3మృగము}; యూధంబు = దళముల; తోన్ = తోటి; పటు = మిక్కుటమైన; వేగ = వేగముగాపోవుట; ఆన్విత = కలిగిన; ఘోటక = అశ్వ; వ్రజము = దళముల; తోన్ = తోటి; బంధు = బంధువుల; ప్రియ = ఇష్ఠుల; శ్రేణి = సమూహముల; తోన్ = తోటి; కటు = అధికమైన; సంరంభము = ఆటోపము; తోన్ = తోటి; విదర్భతనయన్ = రుక్మిణిని {విదర్భతనయ - విదర్భరాజు కుమార్తె, రుక్మిణి}; కైకొందున్ = చేపట్టెదను; అంచున్ = అని; విశంకటవృత్తిన్ = గొప్పగా; చనుదెంచెన్ = వచ్చెను; చైద్యుడు = శిశుపాలుడు; కడున్ = మిక్కలి; గర్వించి = అహంకరించి; ఆ = ఆ యొక్క; వీటి = ఊరున, కుండినగరమున; కిన్ = కు.
:
: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment