Sunday, December 7, 2014

రుక్మిణీకల్యాణం – హరి యొకఁ డేగినాఁడు

44- వ.
మఱియు నానాదేశంబుల రాజు లనేకు లేతెంచి రందు శిశుపాలు నెదుర్కొని పూజించి భీష్మకుం డొక్క నివేశంబున నతని విడియించె; నంతఁ ద ద్వృత్తాంతంబు విని.
45- చ.
రి యొకఁ డేగినాఁడు మగధాదులు చైద్యహితాను సారులై
పతు లెందఱేని చనినారు కుమారికఁ దెచ్చుచోట సం
మగుఁ దోడు గావలయుఁ గంసవిరోధికి నంచు వేగఁ దా
రిగె హలాయుధుండు గమలాక్షుని జాడ ననేక సేనతోన్.
          ఇంకా వివిధదేశాలనుండి అనేకమంది రాజులు వచ్చారు. భీష్మకుడు వారిలో శిశుపాలుడికి ఎదుర్కోలు మొదలైన మర్యాదలు చేసి తగిన విడిది ఏర్పాటు చేసాడు. ఈ విషయాలు తెలిసి.
       బలరాముడు అయ్యో. కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు జరాసంధుడు మున్నగువారు శిశుపాలునికి సాయంగా వెళ్ళారు. బాలికను తెచ్చేటప్పుడు యుద్దం తప్పదు. కృష్ణుడికి సాయం అవసరం. అంటూ బలరాముడు కృష్ణుని వెనుక సైన్యం తీసుకొని వెళ్ళాడు.
45- cha.
hari yokaM~ DEginaaM~Du magadhaadulu chaidyahitaanu saarulai
narapatu leMdaRrEni chaninaaru kumaarikaM~ dechchuchOTa saM
gara maguM~ dODu gaavalayuM~ gaMsavirOdhiki naMchu vEgaM~ daa
narige halaayudhuMDu gamalaakShuni jaaDa nanEka sEnatOn.
          మఱియున్ = ఇంకను; నానా = పెక్కు; దేశంబుల = దేశములకు చెందిన; రాజులు = ఏలికలు; అనేకులు = అనేకమంది; ఏతెంచిరి = వచ్చిరి; అందున్ = వారిలో; శిశుపాలున్ = శిశుపాలుని; ఎదుర్కొని = ఎదురువెళ్ళి; పూజించి = గౌరవించి; భీష్మకుండు = భీష్మకుడు; ఒక్క = ఒకానొక; నివేశంబునన్ = నివాసమునందు; అతనిన్ = అతనిని; విడియించెన్ = ఉంచెను; అంతన్ = తరువాత; తత్ = ఆ యొక్క; వృత్తాంతంబు = విషయము; విని = విని.
          హరి = కృష్ణుడు; ఒకడు = ఒక్కడే; ఏగినాడు = వెళ్ళినాడు; మగధ = జరాసంధుడు; ఆదులున్ = మున్నగువారు; చైద్య = శిశుపాలునికి; హితానుసారులు = మేలుకోరువారు; = అయ్యి; నరపతులు = రాజులు; ఎందఱేని = ఎంతోమంది; చనినారు = వెళ్ళిరి; కుమారికన్ = కన్యకను; తెచ్చుచోటన్ = తీసుకువచ్చేటప్పుడు; సంగరము = యుద్ధము; అగున్ = జరుగును; తోడు = సహాయము; కావలయున్ = అవసరమగును; కంసవిరోధి = కృష్ణుని; కిన్ = కి; అంచున్ = అని; వేగన్ = వేగముగా; తాన్ = అతను; అరిగెన్ = వెళ్ళెను; హలాయుధుండు = బలరాముడు {హలాయుధుడు - హల (నాగలి) ఆయుధము కలవాడు, బలరాముడు}; కమలాక్షుని = పద్మాక్షుని, కృష్ణుని; జాడన్ = వెనుకనే; అనేక = పెక్కు; సేన = సేనల; తోన్ = తోటి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: