57- ఉ.
మెచ్చె
భవద్గుణోన్నతి; కమేయ
ధనావళు లిచ్చె నాకుఁ; దా
వచ్చె సుదర్శనాయుధుఁడు
వాఁడె; సురాసురు లెల్ల నడ్డమై
వచ్చిననైన
రాక్షసవివాహమునం గొనిపోవు నిన్ను; నీ
సచ్చరితంబు
భాగ్యమును సర్వము నేడు ఫలించెఁ గన్యకా!”
“నీ సుగుణాల్ని మెచ్చుకున్నాడమ్మా. అంతులేని ధనాన్ని
నాకిచ్చాడు. చక్రి తానే స్వయంగ వచ్చేడు. దేవదానవు లడ్డమైనా సరే నిన్ను
తీసుకువెళ్తాడు. నీ మంచి తనం అదృష్టం ఇవాళ్టికి ఫలించాయమ్మా.” అని దూతగా వెళ్ళిన విప్రుడు అగ్నిద్యోతనుడు రుక్మిణికి శుభవార్త
చెప్పాడు.
57- u.
mechche bhavadguNOnnati; kamEya dhanaavaLu lichche naakuM~; daa
vachche sudarshanaayudhuM~Du vaaM~De; suraasuru lella naDDamai
vachchinanaina raakShasavivaahamunaM gonipOvu ninnu; nee
sachcharitaMbu bhaagyamunu sarvamu nEDu phaliMcheM~ ganyakaa!”
మెచ్చెన్ = మెచ్చుకొనెను; భవత్ = నీ యొక్క; గుణ = సుగుణముల; ఉన్నతిన్ = మేలిమి; కిన్ = కి; అమేయ = అంతులేని; ధనా = సంపదల; ఆవళుల్ = సమూహములను; ఇచ్చెన్ = ఇచ్చెను; నా = నా; కున్ = కు; తాన్ = అతను; వచ్చెన్ = వచ్చెను; సుదర్శనాయుధుడు = కృష్ణుడు {సుదర్శనాయుధుడు - సుదర్శనమను చక్రాయుధము కలవాడు,
విష్ణువు, కృష్ణుడు}; వాడె = అతనే; సురాసురులు = దేవదానవులు; ఎల్లన్ = అందరు; అడ్డమై = అడ్డుపడుటకు; ఐ = అయ్యి; వచ్చిననైన = వచ్చినప్పటికి; రాక్షసవివాహమునన్ = రాక్షసవివాహ పద్ధతిని; కొనిపోవు = తీసుకెళ్ళును; నినున్ = నిన్ను; నీ = నీ యొక్క; సత్ = మంచి; చరితంబు = వర్తనల; భాగ్యమును = ఫలములు; సర్వమున్ = అంతా; నేడు = ఇవాళ; ఫలించెను = ఫలితములనిచ్చినవి; కన్యకా = బాలికా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment