70- వ.

అంతేకాదు. అలా గౌరీపూజ
పూజచేసి దేవాలయంబయటకు వచ్చిన రుక్మిణీవనిత సౌందర్యానికి విభ్రాంతులైన అక్కడి
రాజు లందరు ఆమె చిరునవ్వులకి, సిగ్గులతో కూడిన ఓరచూపులకి మనసులు కరిగిపోయి, ధైర్యాలు
వదలారు. గాంభీర్యాలు విడిచిపెట్టి. గౌరవమర్యాదలు మరిచారు. చేష్టలుదక్కి మైమరచారు,
ఆయుధాలు జారవిడిచారు. ఏనుగులు గుర్రాలు రథాలు ఎక్కలేక నేలకు వాలారు. ఆ లేడి కన్నుల
చిన్నదేమో తన ఎడంచేతి గోరుతో ముంగురులు సరిచేసుకుంటోంది. పైట సర్దుకుంటోంది.
కడగంటి చూపులతో ఆ రాజ సమూహాన్ని పరిశీలిస్తోంది.
మఱియున్ = అంతేకాకుండా; ఆ = ఆ యొక్క; ఇంతి = పడతి, స్త్రీ; దరహాస = చిరునవ్వులతో; లజ్జా = సిగ్గుతో కూడిన; అవలోకనంబులన్ = చూపులచేత; చిత్తంబులు = మనస్సులు; ఏమఱి = పరాకుపడి; ధైర్యంబులు = తాలుములు; దిగనాడి = విడిచి; గాంభీర్యంబులు = పెద్దరికములు; విడిచి = వదలి; గౌరవంబులు = గొప్పతనములు; మఱచి = మరిచిపోయి; చేష్టలు = అవయవములకదలికలు; మాని = లేనివారై; ఎఱుకలు = తెలివిడి; ఉడిగి = నశించి; ఆయుధంబులున్ = ఆయుధములను; దిగవైచి = జారవిడిచి; గజ = ఏనుగులు; తురగ = గుర్రములు; రథా = రథములు; ఆరోహణంబులు = ఎక్కుటలు; చేయనేరక = చేయలేక; రాజులు = రాజులు; ఎల్లన్ = అందరు; నేల = భూమి; కున్ = మీదకి; వ్రాలిరి = ఒరిగిర; ఆ = ఆ యొక్క; ఏణీలోచన = సుందరి {ఏణీలోచన - లేడివంటి కన్నులు కలామె, స్త్రీ}; తన = ఆమె యొక్క; వామ = ఎడమ; కర = చేతి; నఖరంబులన్ = గోళ్ళతో; అలకంబులన్ = ముంగురులను; తలంగద్రోయుచున్ = ఎగదోసికొనుచు; ఉత్తరీయంబున్ = పైబట్ట, పైటను; చక్కన్ = చక్కగా; ఒత్తుచున్ = సవరించుకొనుచు; కడకంటి = కడకన్నుల; చూపులన్ = చూపులచేత; క్రమంబునన్ = క్రమముగా; ఆ = ఆ యొక్క; రాజ = రాజుల; లోకంబున్ = సమూహమును; ఆలోకించుచు = చూస్తు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment