Wednesday, December 3, 2014

రుక్మిణీకల్యాణం – రచ్చలు గ్రంతలు

40- సీ.
చ్చలు గ్రంతలు రాజమార్గంబులు
          విపణి దేశంబులు విశదములుగఁ
జేసిరి; చందనసిక్త తోయంబులు
          లయంగఁ జల్లిరి; లువడములు
మణీయ వివిధతోణములుఁ గట్టిరి
          కల గృహంబులు క్కఁ జేసి;
ర్పూరకుంకుమారుధూపములు పెట్టి
          తివలుఁ బురుషులు న్ని యెడల
ఆ.
వివిధవస్త్రములను వివిధమాల్యాభర
ణానులేపనముల మరి యుండి
ఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి
రుత్సవమున నగర మొప్పియుండె.
          ఆ కుండిన నగర మంతా ఉత్సాహంతో వెలిగిపోతోంది. వీధులు, సందులు, రాజమార్గాలు, బజార్లు అన్ని శుభ్రం చేసారు. మంచి గంధం కలిపిన నీళ్ళు కళ్ళాపి జల్లారు. కలువపూల దండలు మనోహరమైన తోరణాలు కట్టారు. నగరంలోని ఇళ్ళన్ని శుభ్ర పరచారు. సుగంధ ధూపాలు పట్టారు. ప్రతిచోట రకరకాల పూలు, బట్టలు, అలంకారాలు స్త్రీ పురుషులు ధరించారు. ప్రజలు సంతోషంతో మంగళ వాద్యాలు అన్నిటిని గట్టిగా వాయిస్తున్నారు.
40- see.
rachchalu graMtalu raajamaargaMbulu
          vipaNi dEshaMbulu vishadamulugaM~
jEsiri; chaMdanasikta tOyaMbulu
          galayaMgaM~ jalliri; kaluvaDamulu
ramaNeeya vividhatOraNamuluM~ gaTTiri
          sakala gRihaMbulu chakkaM~ jEsi;
karpoorakuMkumaagarudhoopamulu peTTi
          rativaluM~ buruShulu nanni yeDala
aa.
vividhavastramulanu vividhamaalyaabhara
NaanulEpanamula namari yuMDi
rakhila vaadyamulu mahaapreeti m
rOyiMchi
rutsavamuna nagara moppiyuMDe.
          రచ్చలు = రథ్యలు, రథబాటలు; క్రంతలు = చిన్నవీధులు, సందులు; రాజమార్గంబులు = ప్రధానమార్గములు; విపణి = వ్యాపార; దేశంబులున్ = ప్రదేశములు; విశదములుగా = శుభ్రపరచినవిగా; చేసిరి = తయారు చేసారు; చందన = మంచిగంధము; సిక్త = కలిపిన; తోయంబులున్ = నీళ్ళు; కలయన్ = అంతటను, కళ్ళాపి; చల్లిరి = చల్లిరి; కలువడములు = కలువలసరములు {కలువడములు - స్తంభమునకు వేలాడదీసిన కలువపూల దండ}; రమణీయ = అందమైన; వివిధ = నానావిధములైన; తోరణములున్ = తోరణములను; కట్టిరి = కట్టినారు; సకల = ఎల్ల; గృహంబులున్ = గృహములను; చక్కజేసి = బాగుపరచి; కర్పూర = పచ్చకర్పూరము; కుంకుమ = కుంకుమపువ్వు; అగరు = అగరుచెక్కల; ధూపములున్ = పొగధూపములను; పెట్టిరి = పట్టించిరి; అతివలు = ఆడవారు; పురుషులున్ = మగవారు; అన్ని = సర్వ; ఎడలన్ = ప్రదేశు లందు.
          వివిధ = రకరకముల; వస్త్రములను = బట్టలు; వివిధ = అనేక రకములైన; మాల్య = పూదండలు; ఆభరణ = భూషణములు; అనులేపనములన్ = మైపూతలతో; అమరి = అలంకరించుకొని; ఉండిరి = ఉన్నారు; అఖిల = ఎల్ల; వాద్యములున్ = వాయిద్యములను; మహా = మిక్కలి; ప్రీతిన్ = ప్రేమతో; మ్రోయించిరి = వాయించినారు; ఉత్సవమునన్ = వేడుకలతో; నగరము = పట్టణము; ఒప్పి = చక్కగానై; ఉండె = ఉండెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: