58- వ.
అనిన
వైదర్భి యిట్లనియె.
59- మ.
“జలజాతేక్షణుఁ
దోడి తెచ్చితివి నా సందేశముం
జెప్పి; నన్
నిలువం బెట్టితి; నీ కృపన్ బ్రతికితిన్ నీ
యట్టి పుణ్యాత్మకుల్
గలరే
దీనికి నీకుఁ బ్రత్యుపకృతిం గావింప
నే నేర; నం
జలిఁ
గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధు
చింతామణీ!”
అలా చెప్పిన విప్రునితో
విదర్భ రాకుమారి రుక్మిణి ఇలా అంది.
“ఓ సద్భ్రాహ్మణ శ్రేష్ఠుడా! ప్రియబాంధవోత్తముడా! నా సందేశం అందించి
పద్మాక్షుడిని వెంటబెట్టుకొచ్చావు. నా ప్రాణాలు నిలబెట్టావు. నీ దయ వలన బతికిపోయాను.
దీనికి తగిన మేలు చేయలేనయ్య. నమస్కారం మాత్రం పెడతాను.”
58- va.
anina vaidarbhi yiTlaniye.
59- ma.
“jalajaatEkShaNuM~ dODi techchitivi naa saMdEshamuM jeppi; nan
niluvaM beTTiti; nee kRipan bratikitin nee yaTTi puNyaatmakul
galarE deeniki neekuM~ bratyupakRitiM gaaviMpa nE nEra; naM
jaliM~ gaaviMcheda; bhoosuraanvayamaNee! sadbaMdhu chiMtaamaNee!”అనినన్ = అనగా; వైదర్భి = రుక్మిణీదేవి {వైదర్భి - విదర్భదేశమునకు చెందినామె, రుక్మిణి}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
జలజాతేక్షణున్ = పద్మాక్షుని, కృష్ణుని; తోడి = కూడా; తెచ్చితివి = తీసుకొచ్చతివి; నా = నా; సందేశమున్ = సమాచారమును; చెప్పి = తెలిపి; నన్నున్ = నన్ను; నిలువంబెట్టితి = రక్షించితివి; నీ = నీ యొక్క; కృపన్ = దయతోటి; బ్రతికితిన్ = కాపాడబడితిని; నీ = నీ; అట్టి = లాంటి; పుణ్యాత్మకుల్ = పుణ్యాత్ములు; కలరే = ఉన్నారా; దీని = దీని, (ఈ పని); కిన్ = కి; నీ = నీ; కున్ = కు; ప్రత్యుపకృతిన్ = ప్రత్యుపకారము; కావింపన్ = చేయుటకు; నేన్ = నేను; నేరన్ = చాలను; అంజలి = నమస్కారము; కావించెదన్ = చేసెదను; భూసుర = బ్రాహ్మణ; అన్వయ = వంశములో; మణీ = శ్రేష్ఠుడా; సద్బంధు = మంచికి బంధువులైన వారిలో; చింతామణి = చింతామణి వంటివాడా {చింతామణి - చింతించగానే కోరికలను సిద్ధింపజేసెడి
మణి}.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment