48- మ.
ఘను డా
భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁ
డై చిక్కెనో?
విని
కృష్ణుం డది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం
డనుకూలింపఁ
దలంచునో తలఁపడో? యార్యా
మహా దేవియున్
నను
రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా
భాగ్య మెట్లున్నదో?
ఆ బ్రాహ్మణుడు అసలు వెళ్ళాడో
లేదో? లేకపోతే దారిలో ఎక్కడైనా చిక్కుకు పోయాడేమో? నా సందేశం విని కృష్ణుడు తప్పుగా అనుకున్నాడేమో?
పార్వతీదేవి నన్ను కాపాడలనుకుందో లేదో? నా అదృష్టమెలా ఉందో?”
అంటు ఎంతో ఆత్మవిశ్వాసంతో
బ్రాహ్మణుని పంపిన రుక్మిణీదేవి, డోలాయమాన స్థితి పొందుతోంది. ఆ స్థాయికి
తగ్గ ఈ పద్యం చెప్పిన మన పోతన్నకి ప్రణామములు.
48- ma.
ghanu Daa bhoosuru DEgenO? naDuma
maargashraaMtuM~ Dai chikkenO?
vini kRiShNuM Dadi tappugaaM~ dalaM~chenO?
vichchEsenO? yeeshvaruM
DanukooliMpaM~ dalaMchunO talaM~paDO? yaaryaa
mahaa dEviyun
nanu rakShiMpa neRruMgunO yeRruM~gadO? naa
bhaagya meTlunnadO?
ఘనుడు = గొప్పవాడు; ఆ = ఆ యొక్క; భూసురుడు = విప్రుడు; ఏగెనో = వెళ్ళాడో లేదో; నడుమన్ = మధ్యలో; మార్గ = ప్రయాణపు; శ్రాంతుడు = బడలిక చెందినవాడు; ఐ = అయ్యి; చిక్కెనో = చిక్కుబడిపోయెనేమో; విని = విన్నవాడై; కృష్ణుండు = కృష్ణుడు; అది = దానిని; తప్పు = తప్పు; కాన్ = అయినట్లు; తలచెనో = భావించెనేమో; విచ్చేసెనో = వచ్చెనేమో; ఈశ్వరుండు = భగవంతుడు; అనుకూలింపన్ = అనుకూలించవలెనని; తలంచునో = ఎంచునో; తలపడో = ఎంచకుండునో; ఆర్యామహాదేవియున్ = పార్వతీదేవి {ఆర్య - శ్రేష్ఠురాలు, పార్వతి}; ననున్ = నన్ను; రక్షింపన్ = కాపాడవలెనని; ఎఱుంగునో = గుర్తించినదో; ఎఱుగదో = గుర్తించలేదో; నా = నా యొక్క; భాగ్యము = అదృష్టము; ఎట్లున్నదో = ఎలా ఉందో.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment