73- మ.
ఘన
సింహంబుల కీర్తి నీచమృగముల్ గైకొన్న
చందంబునన్
మన
కీర్తుల్ గొని బాలఁ దోడ్కొనుచు నున్మాదం బుతో
గోపకుల్
చనుచున్నా
రదె; శౌర్య మెన్నటికి? మీ శస్త్రాస్త
ముల్ గాల్పనే?
తనుమధ్యన్
విడిపింపమేని నగరే ధాత్రీజనుల్
క్రంతలన్.
గొప్ప గొప్ప సింహాల పరువు
నీచమైన జంతువులు తీసేసినట్లు, మన పరువు తీసి కృష్ణుడు రుక్మిణీ పడతిని పట్టుకు పోతున్నాడు.
అదిగో చూడండి, గొల్లలు ఉద్రేకంగా పారిపోతున్నరు. రాకుమారిని విడిపించ లేకపోతే మన
పరాక్రమా లెందుకు. మన అస్త్రశస్త్రా లెందుకు దండగ. సందుగొందుల్లో జనాలు నవ్వరా.
అని జరాసంధాదులు తమలో తాము హెచ్చరించుకోసాగారు.
73- ma.
ghana siMhaMbula keerti neechamRigamul gaikonna chaMdaMbunan
mana keertul goni baalaM~ dODkonuchu nunmaadaM butO gOpakul
chanuchunnaa rade; shaurya mennaTiki? mee shastraasta mul
gaalpanE?
tanumadhyan viDipiMpamEni nagarE dhaatreejanul kraMta lan.
ఘన = గొప్ప; సింహంబుల = సింహముల యొక్క; కీర్తిన్ = కీర్తిని; నీచ = అల్పమైన; మృగముల్ = జంతువులు; కైకొన్న = తీసుకొన్న; చందంబునన్ = విధముగ; మన = మన యొక్క; కీర్తుల్ = కీర్తులను; కొని = తీసుకొని; బాలన్ = కన్యను; తోడ్కొనుచున్ = కూడతీసుకొని; ఉన్మాదంబు = ఒళ్ళుతెలియనితనము; తోన్ = తోటి; గోపకుల్ = గొల్లవారు; చనుచున్నారు = పోవుచున్నారు; అదె = అదిగో; శౌర్యము = పరాక్రమము; ఎన్నిటికిన్ = ఇకదేనికి; మీ = మీ యొక్క; శస్త్ర = శస్త్రములు; అస్త్రములు = అస్త్రములు; కాల్పనే = దేనికి తగులబెట్టుటకా; తనుమధ్యన్ = యువతిని {తనుమధ్య - తను (సన్నని) మధ్య (నడుము కలామె), స్త్రీ}; విడిపింపమేని = విడిపించకపోయినచో; నగరే = నవ్వరా, ఎగతాళిచేయరా; ధాత్రీ = భూలోక; జనుల్ = ప్రజలు; క్రంతలన్ = వీధులలో.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :
No comments:
Post a Comment