సరసిజనిభహస్తా
10.1-1791-మా.
సరసిజనిభహస్తా! సర్వలోకప్రశస్తా!
నిరుపమ శుభమూర్తీ! నిర్మలారూఢకీర్తీ!
పరహృదయవిదారీ! భక్తలోకోపకారీ!
గురుబుధజనతోషీ! ఘోరదైతేయశోషీ!
కమలాలతో సమానమైన కరములు గలవాడ! ఎల్లలోకాలలోను
ఎన్నదగిన శ్రేష్ఠుడ! సాటిలేని మంగళ స్వరూపుడ! స్వచ్ఛమైన వన్నెకెక్కిన
కీర్తి గలవాడ! శత్రువుల గుండెలను భేదించువాడ! భక్త సమాజ
మంతటికి మేలు చేయువాడ! పెద్దలను పండితులను సంతోషపరచువాడ! భయంకరులైన
రాక్షసులను నశింపజేయువాడ!
ఇది దశమస్కంధ ప్రథమభాగాంత ప్రార్థన.
10.1-1791-maa.
sarasijanibhahastaa!
sarvalOkapraSastaa!
nirupama
Subhamoortee! nirmalaarooDhakeertee!
parahRdayavidaaree!
bhaktalOkOpakaaree!
gurubudhajanatOshee!
ghOradaitaeyaSOshee!
సరసిజ నిభ హస్తా = శ్రీరామా {సరసిజ నిభ హస్తుడు
- సరసిజ (పద్మము) నిభ (వంటి) హస్తుడు (చేతులు కలవాడు), శ్రీరాముడు}; సర్వ లోక ప్రశస్తా = శ్రీరామా {సర్వ లోక ప్రశస్తుడు - సర్వ (సమస్తమైన) లోక (లోకములలోను) ప్రశస్తుడు (శ్లాఘింపబడువాడు),
శ్రీరాముడు}; నిరుపమ శుభ మూర్తీ = శ్రీరామా {నిరుపమశుభమూర్తి - నిరుపమ (సాటిలేని) శుభ (మేళ్ళు కలిగించెడి)
మూర్తి (ఆకృతి కలవాడు), శ్రీరాముడు}; నిర్మ లారూఢ కీర్తీ = శ్రీరామా {నిర్మ లారూఢ కీర్తి - నిర్మల (పరిశుద్ధ మైన) ఆరూఢ (నిలక డైన) కీర్తి
(కీర్తి కలవాడు), శ్రీరాముడు}; పర హృదయ విదారీ = శ్రీరామా {పర హృదయ విదారి - పర (విరోధుల) హృదయ (గుండెలను) విదారి (చీల్చెడి
వాడు), శ్రీరాముడు}; భక్త లో కోపకారీ = శ్రీరామా {భక్త లో కోపకారి - భక్తులను లోక (ఎల్లరకు) ఉపకారి (ఉపకారము
చేయువాడు), శ్రీరాముడు}; గురు బుధ జన తోషీ = శ్రీరామా {గురు బుధ జన తోషి - గురు (గొప్ప) బుధ (ఙ్ఞానము కల) జన (వారికి) తోషి
(సంతోషము కలిగించు వాడు), శ్రీరాముడు}; ఘోర దైతేయ శోషీ = శ్రీరామా {ఘోర దైతేయ శోషి - ఘోర (క్రూర మైన) దైతేయ (రాక్షసులను) శోషి
(నశింపజేయు వాడు), శ్రీరాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
1 comment:
మహేందర్ గారు మీ అభిమానానికి, మీ తెలుగు అభిమానానికి, పోతన భాగవతంపై ఇష్టానికి ధన్యవాదాలు.
మీరిచ్చే ఈ ప్రోత్సాహం మన తెలుగుభాగవతానికి ఎంతో విలువైనది.
నా సంచారిణి 9 9 596 1 369 50
Post a Comment